AP Lawyers Practice : ఏపీ న్యాయ‌వాదుల ప్రాక్టీస్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు-application deadline extended for lawyer practice certificates in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Lawyers Practice : ఏపీ న్యాయ‌వాదుల ప్రాక్టీస్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు

AP Lawyers Practice : ఏపీ న్యాయ‌వాదుల ప్రాక్టీస్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు

HT Telugu Desk HT Telugu
Updated Feb 19, 2025 06:19 PM IST

AP Lawyers Practice : ఏపీలో న్యాయవాదుల ప్రాక్టీస్ దరఖాస్తు గడువు పెంచుతూ రాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులకు మార్చి 15న ఆఖరు తేదీగా నిర్ణయించారు. న్యాయ‌వాదిగా ప్రాక్టీస్ చేసేవారు త‌మ ప్రాక్టీస్‌కు సంబంధించి ధృవీక‌ర‌ణ ప‌త్రాలు బార్ కౌన్సిల్‌కు స‌మర్పించాల్సి ఉంటుంది.

ఏపీ న్యాయ‌వాదుల ప్రాక్టీస్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు
ఏపీ న్యాయ‌వాదుల ప్రాక్టీస్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు

AP Lawyers Practice : న్యాయ‌వాదులు త‌మ ప్రాక్టీస్ ధ్రువీక‌ర‌ణ‌కు సంబంధించి స‌ర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీవోపీ) ద‌ర‌ఖాస్తుల‌ను చేసుకునేందుకు గ‌డువు పొడిగించారు. ఆఖ‌రు తేదీగా మార్చి 15న నిర్ణయించారు. అర్హత‌, ఆస‌క్తి ఉన్న వారు ఆ తేదీలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ కోరింది.

న్యాయ‌వాదుల ప్రాక్టీస్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిస్తూ రాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. స్టేట్ బార్ కౌన్సిల్ ఛైర్మన్ న‌ల్లారి ద్వార‌క‌నాథ‌రెడ్డి అధ్యక్షత‌న హైకోర్టులో బార్ కౌన్సిల్ స‌ర్వస‌భ్య స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో తీసుకున్న నిర్ణయం మేర‌కు ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్పణ‌కు గ‌డువు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. న్యాయ‌వాదిగా ప్రాక్టీస్ చేసేవారు త‌మ ప్రాక్టీస్‌కు సంబంధించి ధృవీక‌ర‌ణ ప‌త్రాలు బార్ కౌన్సిల్‌కు స‌మర్పించాల్సి ఉంటుంది.

న్యాయ‌వాది దాఖ‌లు చేసే కేసుల‌కు సంబంధించిన వ‌కాల‌త్‌లు, ఆ కేసుల్లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, తీర్పుల కాపీల‌ను జ‌త చేసి ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. వాటిని ప‌రిశీలించిన అనంత‌రం బార్ కౌన్సిల్ సీవోపీ జారీ చేస్తుంది. వ‌కాల‌త్‌ల స‌ర్టిఫైడ్ కాపీలు, ఉత్తర్వుల కాపీల జారీలో కోర్టుల వైపు నుంచి జ‌రుగుతున్న ఆల‌స్యం, లాయ‌ర్ల అభ్యర్థన మేర‌కు బార్ కౌన్సిల్ గ‌డువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

న్యాయవాదిగా అర్హత కలిగిన వ్యక్తి, అవసరమైన ధ్రువీక‌ర‌ణ పత్రాలతో పాటు నమోదు కోసం దరఖాస్తును సోమవారం, మంగళవారాల్లో మ‌ధ్యహ్నం 2-30 నుంచి 4-30 వరకు దాఖలు చేయవచ్చు. అయితే, ఉద్యోగాలు, వ్యాపారం, ఇత‌ర వృత్తిల్లో ఉన్న వారిని న్యాయ‌వాదిగా అనుమ‌తించ‌రు. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు నమోదు తేదీని ఆ తరువాత తెలియజేస్తారు. దరఖాస్తుతో పాటు ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ సమర్పించాలి.

జతచేయాల్సిన పత్రాలు

ద‌ర‌ఖాస్తుతో ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను జ‌త చేయాల్సి ఉంటుంది. 1. జనన ధ్రువీకరణ పత్రం, 2, ఎస్ఎస్‌సీ ఉత్తీర్ణత సాధించిన స‌ర్టిఫికేట్‌ ఫోటో కాపీ, 3. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన‌ సర్టిఫికేట్, మార్కుల జాబితా ఫోటో కాపీ, 4. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఫోటో కాపీ, 5. లా సర్టిఫికేట్ ఫోటో కాపీ (స్నాతకోత్సవం / ప్రొవిజిన‌ల్‌), 6. కుల ధ్రువీకరణ పత్రం ఫోటో కాపీ జత చేయాల్సి ఉంటుంది. 7. ఏదైనా ఇతర అర్హతల సర్టిఫికెట్లు ఉంటే వాటిని కూడా జ‌త చేయ‌వ‌చ్చు. 8. సర్వీస్ నుంచి పదవీ విరమణ చేసిన వ్యక్తుల విషయంలో రిటైర్మెంట్, రిలీవింగ్ ఆర్డర్ ఫోటో కాపీ ఉండాలి. అన్ని ఫోటో కాపీలను గెజిటెడ్ అధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. అన్ని ఒరిజిన‌ల్ సర్టిఫికెట్ల వాటిని నమోదు దరఖాస్తుతో పాటు పరిశీలన కోసం సమర్పించాలి.

సర్వీసులో ఉన్నప్పుడు లా చదివిన దరఖాస్తుదారులు ఈ క్రింది పత్రాలను సమర్పించాలి

లా చదువుకోవడానికి యజమాని నుంచి అనుమతి లేఖ, లా కళాశాల నుంచి స‌ర్టిఫికేట్‌, లా చదువు కాలంలో పనిచేసే స్థలం రుజువు సర్టిఫికెట్, నమోదు రోజున, అభ్యర్థులు తెల్లటి దుస్తులు, నల్లకోటు, నల్ల బూట్లు, నల్ల టై ధరించాలి. మహిళా అభ్యర్థులు తెల్ల చీర / చుడీదార్,నల్ల కోటు ధరించాలి.

రిజిస్ట్రేష‌న్ ఫీజు

  • రిజిస్ట్రేష‌న్ ఫీజు కింద జనరల్ కేటగిరీ, ఓబీసీ రూ.1,250 చెల్లించాలి. అందులో ఎన్‌రోల్‌మెంట్ ఫీజు రూ.600, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫండ్ రూ.150, స్టాప్ డ్యూటీ 500 ఉంటుంది.
  • సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నంబర్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ. హైకోర్టు బ్రాంచ్, అమ‌రావ‌తిలోని “బార్ కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్”, అమరావతి క్రెడిట్‌కు రూ. 600 మొత్తాన్ని చెల్లించాలి.
  • అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ. హైకోర్టు బ్రాంచ్, అమ‌రావ‌తిలోని “బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ కలెక్షన్ ఫండ్” క్రెడిట్‌కు రూ. 150 మొత్తాన్ని సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నంబర్‌లో చెల్లించాలి.
  • రూ. 500ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ. హైకోర్టు బ్రాంచ్, అమ‌రావ‌తిలోని సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నంబర్ 38178493296లో స్టాంప్ డ్యూటీ కింద “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్” క్రెడిట్‌కు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీల‌కు రూ.625 ఫీజు ఉంటుంది. అందులో ఎన్‌రోల్‌మెంట్ ఫీజు రూ.100, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫండ్ రూ.25, స్టాప్ డ్యూటీ 500 ఉంటుంది.
  • సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నంబర్ 38197167485లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ. హైకోర్టు బ్రాంచ్, అమ‌రావ‌తిలోని “బార్ కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్”, అమరావతి క్రెడిట్‌కు రూ. 100 మొత్తాన్ని చెల్లించాలి.
  • అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ. హైకోర్టు బ్రాంచ్, అమ‌రావ‌తిలోని “బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ కలెక్షన్ ఫండ్” క్రెడిట్‌కు రూ. 25 మొత్తాన్ని సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నంబర్ 52005821233లో చెల్లించాలి.
  • రూ. 500ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ. హైకోర్టు బ్రాంచ్, అమ‌రావ‌తిలోని సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నంబర్ 38178493296లో స్టాంప్ డ్యూటీ కింద “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్” క్రెడిట్‌కు చెల్లించాలి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం