AP Govt Jobs 2024 : ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు - అర్హతలు, ముఖ్యతేదీలివే
APMDC Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. రెగ్యులర్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేస్తున్నారు. ఆ వివరాలను ఇక్కడ చూడండి….
APMDC Recruitment 2024 Updates: విజయవాడలోని ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(APMDC) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. వీటిని రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మార్చి 13వ తేదీని అప్లికేషన్లకు తుది గడువుగా ప్రకటించారు. https://apmdc.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మరిన్ని వివరాలను ఇక్కడ చూడండి…..
ముఖ్య వివరాలు:
రిక్రూట్ మెంట్ ప్రకటన -ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
ఉద్యోగ ఖాళీలు - 06
వివరాలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ (సర్వే) (మెటాలిఫరస్) - 03 పోస్టులు, మేనేజ్‌మెంట్ ట్రైనీ (సర్వే) (కోల్) - 03 పోస్టులు.
అర్హతలు - డిగ్రీ/ డిప్లొమా (మైనింగ్/ మైన్ సర్వే) లేదా డిగ్రీ (సైన్స్), మైన్ సర్వేయర్స్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ కలిగి ఉండాలి.
వయోపరిమితి - 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తులు - ఆన్ లైన్
ఎంపిక విధానం - కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
150 మార్కుల(Aptitude & Reasoning– 10%- General Knowledge questions –~20% , Subject related questions –~70%)కు ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
పరీక్షా సమయం - 2 గంటల 30 నిమిషాలు.
ఎగ్జామ్ ఫీజు- బీసీ/ ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్ కేటగిరీకి రూ.500. ఇతర కేటగిరీలకు రూ.1000 ఉంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు తేదీ - మార్చి 14,2024.
అధికారిక వెబ్ సైట్ - https://apmdc.ap.gov.in/i
ARO వైజాగ్ నోటిఫికేషన్…
Vizag Agniveer Recruitment Rally 2024: విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ 'అగ్నిపథ్' స్కీమ్ కింద 2024-25 సంవత్సరానికి సంబంధించి అగ్నివీరుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 13వ తేదీతో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా…దరఖాస్తుల సమర్పణకు మార్చి 22 వరకు గడువు విధించారు. ఏప్రిల్ 22వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఎంపికైనవారు ఇండియన్ ఆర్మీలో నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులుగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి…
ముఖ్య వివరాలు:
రిక్రూట్ మెంట్ ప్రకటన - ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, విశాఖపట్నం .
పోస్టులు -అగ్నిపథ్'స్కీమ్ లో భాగంగా అగ్నీవీరుల నియామకం.
పోస్టులు - అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, అగ్నివేర్ ట్రేడ్స్ మ్యాన్.
అర్హతలు -అగ్నివీర్ జనరల్ డ్యూటీ పోస్టుకు కనీసం పదో తరగతిలో 45 మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. టెక్నికల్ పోస్టుకు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఐటీఐ కూడా ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు చూస్తే..60 శాతం మార్కులతో ఇంటర్ పాసై ఉండాలి. ట్రేడ్స్ మ్యాన్ కు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి- 17.5 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు - ఎత్తు 166 సెం.మీ ఉండాలి. కొన్ని పోస్టులకు 162 సెం.మీ ఉన్నా సరిపోతుంది. గాలిపీల్చినప్పుడు ఛాతి సెం.మీ పెరగాలి. ఎత్తుకు తగినంత బరువు కూడా కలిగి ఉండాలి.
దరఖాస్తులు - ఆన్ లైన్
దరఖాస్తు రుసుం - రూ.250.
దరఖాస్తులు ప్రారంభం - ఫిబ్రవరి 13, 2024.
దరఖాస్తుల స్వీకరణ తుది గడువు - మార్చి 22, 2024.
ఎంపిక విధానం- ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. రిక్రూట్‌మెంట్ ర్యాలీ(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్/ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్), వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు- అగ్నివీరులాగ ఎంపికైనవారు నాలుగేళ్లు ఆర్మీలో పనిచేయాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం నెలకు రూ.30,000, రెండో సంవత్సరం నెలకు రూ.33,000 చెల్లిస్తారు. మూడో సంవత్సరం నెలకు రూ.36,000, నాలుగో సంవత్సరం నెలకు రూ.40,000 చొప్పున చెల్లిస్తారు.
ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం - 22. ఏప్రిల్ 2024.
అధికారిక వెబ్ సైట్ - https://joinindianarmy.nic.in