APERC Jobs 2024 : ఏపీఈఆర్‌సీలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు - పదో తరగతి అర్హతతోనే, వివరాలివే-aperc job notification for the recruitment of office subordinate posts 2024 check key details are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Aperc Jobs 2024 : ఏపీఈఆర్‌సీలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు - పదో తరగతి అర్హతతోనే, వివరాలివే

APERC Jobs 2024 : ఏపీఈఆర్‌సీలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు - పదో తరగతి అర్హతతోనే, వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 19, 2024 02:24 PM IST

APERC Recruitment 2024 Updates: ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొంది..

ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు
ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు (https://aperc.gov.in/)

APERC Recruitment 2024 Updates: ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్‌సీ) ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చింది. ఇందులో భాగంగా కమిషన్ లో ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతి ఉత్తీర్ణత ఆధారంగా వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపింది. దరఖాస్తుల స్వీకరణకు జనవరి 24వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. ఈ రిక్రూట్ మెంట్ కు సంబంధించిన ముఖ్య వివరాలను ఇక్కడ చూడండి….

ముఖ్య వివరాలు:

ఉద్యోగ ప్రకటన - ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్‌సీ)

ఉద్యోగాల పేరు - ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య - 06

అర్హతలు - పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. దీనికితోడు తెలుగు, ఇంగ్లిష్‌ చదవడం, రాయడం, శారీరక సామర్థ్యం, టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

జీతం - నెలకు రూ.20,600 నుంచి రూ.63,660.

వయోపరిమితి- 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం - ఆఫ్‌లైన్‌ ద్వారా అప్లయ్ చేయాలి.

దరఖాస్తు రుసుం - రూ.500. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తులతు తుది గడువు - 24 జనవరి, 2024.

దరఖాస్తు ఫారమ్ లను https://aperc.gov.in/admin/upload/Notification_OS_10Jan24.pdf పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పూర్తి చేసిన దరఖాస్తులను

Commission Secretary,

Andhra Pradesh Electricity Regulatory Commission,

Red Hills, Khairatabad, Hyderabad. అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు టెన్త్ సర్టిఫికెట్ కాపీ, టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్, రీసెంట్ 3 పాస్‌ పోర్ట్ సైజ్ ఫోటో గ్రాఫ్స్ తో పాటు కమ్యునిటీ డిక్లరేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను జతపర్చాలి.

అధికారిక వెబ్ సైట్ - https://aperc.gov.in/ 

పూర్తిస్థాయి నోటిఫికేషన్ ను కింద ఇచ్చిన పీడీఎఫ్ లో చూడొచ్చు….

AIIMS Mangalagiri Jobs : మంగళగిరి ఎయిమ్స్(AIIMS)లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎయిమ్స్ లో మెడికల్ సూపరింటెండెంట్, రిజిస్ట్రార్, నర్సింగ్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇంటర్య్వూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.2,18,200 జీతాభత్యాలు ఇస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 4వ తేదీలోపు మంగళగిరి ఎయిమ్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో తెలిపారు.

ఎయిమ్స్ మంగళగిరిలో మెడికల్ సూపరింటెండెంట్, రిజిస్ట్రార్, నర్సింగ్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఐదు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. మూడేళ్ల కాలానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 56 సంవత్సరాలుగా నిర్ణయించారు.

మెడికల్ సూపరింటెండెంట్- ఎంపికైన అభ్యర్థులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200లు నెలవారీ జీతంగా చెల్లిస్తారు. .

రిజిస్ట్రార్ పోస్టుకు- ఎంపికైన అభ్యర్థులకు రూ. 78,800 నుంచి రూ. 2,09,200లు నెలవారీ జీతం చెల్లిస్తారు.

నర్సింగ్ సూపరింటెండెంట్- ఎంపికైన అభ్యర్థులకు రూ. 67,700 నుంచి రూ.2,08,700 నెలవారీ జీతం

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్- ఎంపికైన అభ్యర్థులకు రూ. 56,100 నుంచి రూ.1,77,500 నెలవారీ జీతం

ఎలా దరఖాస్తు చేయాలి

అర్హత కలిగిన అభ్యర్థులు ఎయిమ్స్ మంగళగిరి అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ దరఖాస్తు ఫామ్ ప్రింటౌట్ తీసుకొని చివరి తేదీకి ముందుగా మంగళగిరి ఎయిమ్స్ చిరునామాకు పంపాలి.

ఆ చిరునామా- “రిక్రూట్‌మెంట్ సెల్, అడ్మిన్ మరియు లైబ్రరీ బిల్డింగ్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్- 522503". ఆన్‌లైన్ దరఖాస్తు ఫామ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 4, 2024.

Whats_app_banner

సంబంధిత కథనం