APCRDA Recruitment 2024 : ఏపీ సీఆర్‌డీఏలో ఉద్యోగాలు - మంచి జీతం, దరఖాస్తులకు మరికొద్ది గంటలే...!
APCRDA Recruitment 2024 : ఏపీసీఆర్డీఏలో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొత్తం 19 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఇవాళ్టితో (నవంబర్ 13) తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. https://crda.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఏపీ సీఆర్‌డీఏలో ఉద్యోగాలు
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(APCRDA) నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా మొత్తం 19 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చేస్తారు. ఏడాది కాలానికి పని చేయాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ్టితో (నవంబర్ 13) తుది గడువుగా నిర్ణయించారు. ఈ గడువు మరికొద్ది గంటల్లో పూర్తి కానుంది. ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్య వివరాలు
- ఉద్యోగ ప్రకటన - ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఏపీ ప్రభుత్వం.
- మొత్తం ఖాళీలు - 19
- మొత్తం 19 పోస్టుల్లో ఎక్కువగా జీఐఎస్ రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్ పోస్టులు ఆరు ఉన్నాయి.
- అర్హతలు - బీటెక్/ బీఈ, ఎంఈ/ ఎంటెక్, పీజీలో ఉత్తీర్ణత ఉండాలి. దీనికితోడు పని చేసిన అనుభవం కూడా ఉండాలి.
- ఎంపికైన వారికి రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు ఉంది.
- ఎంపికైన వారు విజయవాడ కేంద్రంగా పని చేయాల్సి ఉంటుంది. పోస్టును అనుసరించి మూడు నుంచి ఐదేళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తులకు తుది గడువు - 13, నవంబర్ 2024
- అధికారిక వెబ్ సైట్ - https://crda.ap.gov.in/
- ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే 9493974520 నెంబర్ ను సంప్రదించవచ్చు.
- మెయిల్ అడ్రస్ - recruitment@apcrda.org