'మా ఫోన్లు ట్యాప్ చేశారు - స్వయంగా నాకే వినిపించారు' - వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు-apcc chief ys sharmila says her phone was tapped ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  'మా ఫోన్లు ట్యాప్ చేశారు - స్వయంగా నాకే వినిపించారు' - వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

'మా ఫోన్లు ట్యాప్ చేశారు - స్వయంగా నాకే వినిపించారు' - వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట ముమ్మాటికి వాస్తవమన్నారు. వైసీపీ నేత సుబ్బారెడ్డినే తనకు ట్యాప్ చేసిన ఆడియోలను స్వయంగా వినిపించారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్రమైన దర్యాప్తు చేయాలని కోరారు.

వైఎస్ షర్మిల

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె…. ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమేనని స్పష్టం చేశారు. వైసీపీ నేత వైసీపీ సుబ్బారెడ్డి... ట్యాప్ చేసిన ఆడియోలు స్వయంగా తనకే వినిపించాడని గుర్తు చేశారు.

సాక్ష్యం చెప్పడానికి నేను సిద్ధం - వైఎస్ షర్మిల

ఈ కేసులో తాను ఎక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పమన్న చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కేసీఆర్ - జగన్ సంబంధాల ముందు రక్త సంబంధం కూడా పనికిరాలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఫోన్ ట్యాపింగ్‌పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు… సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. దోషులకు శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.