అమెరికాలో దుండగుడి కాల్పులు - బాపట్ల యువకుడు మృతి
AP Student Killed in USA : అమెరికాలో ఏపీ యువకుడిపై కాల్పులు జరిగాయి. డల్లాస్ లోని ఓ స్టోర్ లో గోపీకృష్ణపై దండగుడు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో చికిత్స పొందుతూ గోపీకృష్ణ మృతి చెందాడు.

AP Student Killed in USA : అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ (32) అమెరికాలోని దుండగుడి కాల్పల్లో మరణించాడు.
గోపీకృష్ణ జీవనోపాది కోసం ఎనిమిది నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అమెరికాలోని అర్కెన్సాస్ రాష్ట్రంలని సూపర్ మార్కెట్‌లో పని చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్‌లో ఉండగా, ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రగాయాలతో గోపీకృష్ణ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
అనంతరం దుండగుడు ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే గోపీకృష్ణను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయాడు. ఈ సమాచారం తెలియడంతో గోపీకృష్ణ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. మృతిడు గోపీకృష్ణకి భార్య, కుమారుడు ఉన్నారు. దీంతో గోపీకృష్ణ స్వగ్రామం యాజలిలో విషాదఛాయలు అలముకున్నాయి.
చీరాల రేప్ కేసులో ముగ్గురు అరెస్ట్….
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో జరిగిన యువతిపై అత్యాచారం, హత్య ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లలో ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. ఈపురుపాలెం గ్రామానికి చెందిన దేవరకొండ విజరు, కారంకి మహేష్ రైల్వే ట్రాక్ సమీపంలో మద్యం సేవిస్తూ అటుగా వచ్చిన బాధితరాలిని బలవంతంగా చెట్ల పొదల్లొకి లాక్కెళ్లారు.
అక్కడ ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ముఖంపై దాడి చేసి హత్య చేశారు. ఇద్దరు నిందితులకు దేవరకొండ శ్రీకాంత్ సహకరించాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు బృందాలుగా ఏర్పాడి దర్యాప్తు చేసి, కేసును ఛేదించినట్లు ఎస్పీ వెల్లడించారు. అయితే నిందితులు దేవరకొండ విజరు, శ్రీకాంత్‌పై చీరాల పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే కొన్ని కేసులు నమోదు ఉన్నాయని తెలిపారు.