Maredumilli : మారేడుమిల్లి కొండల్లో ట్రెక్కింగ్, జలపాతాల్లో సందడి-2 రోజుల టూర్ ప్యాకేజీలివే-ap tourist places maredumilli tour packages for jungle trekking waterfalls visiting ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Maredumilli : మారేడుమిల్లి కొండల్లో ట్రెక్కింగ్, జలపాతాల్లో సందడి-2 రోజుల టూర్ ప్యాకేజీలివే

Maredumilli : మారేడుమిల్లి కొండల్లో ట్రెక్కింగ్, జలపాతాల్లో సందడి-2 రోజుల టూర్ ప్యాకేజీలివే

Maredumilli : కొండ కోనల్లో, ఘాట్ రోడ్ లో ప్రయాణాలు...ప్రకృతి అందాలు వీక్షిస్తూ నైట్ స్టే చేయాలనుకుంటున్నారా? అయితే మారేడుమిల్లి బెస్ట్ టూరిస్ట్ స్పాట్. రాజమండ్రి, కాకినాడ నుంచి రెండు రోజుల టూరిస్ట్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

మారేడుమిల్లి కొండల్లో ట్రెక్కింగ్, జలపాతాల్లో సందడి-2 రోజుల టూర్ ప్యాకేజీలివే

కాంక్రీట్ జంగిల్ నుంచి కాస్త బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రకృతి అందాలకు నెలవైన ఈ టూరిస్ట్ ప్రదేశం మీలో నూతనుత్తేజాన్ని నింపుతుంది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశం. దట్టమైన మారేడుమిల్లి ఎకో టూరిజం హబ్‌గా, పర్యాటకులకు వీకెండ్ గేట్‌వేగా చక్కటి అనుభూతిని కలిగిస్తుంది.

మారేడుమిల్లి అడవులు జీవవైవిధ్యానికి చక్కటి ఉదాహరణ. తూర్పు కనుమలలో భాగమైన మారేడుమిల్లిలో అందమైన వాటర్ ఫాల్స్, అడవుల మధ్య నుంచి కొండల్లో ఘాట్ ప్రయాణాలు, రిసార్టుల్లో స్టే థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తుంది. టూరిజం అభివృద్ధిలో భాగంగా మారేడుమిల్లి ఫారెస్ట్ రెస్ట్ హౌస్ ను నిర్మించారు. ఈ ఫారెస్ట్ రెస్ట్ హౌస్ లో టూరిస్టుల బస కోసం సకల సౌకర్యాలు ఉంటాయి. పర్యాటకుల బస కోసం ఇక్కడ సూట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మారేడుమిల్లి కొండల్లో సాహసికులు కోసం ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి.

ట్రెక్ మార్గాలు

  • వలమూరు నుంచి అమృత ధార వరకు 8 కి.మీ – జలపాతం వద్దకు 2 కి.మీ ట్రెకింగ్
  • క్రాస్ కంట్రీ ట్రెక్ - టైగర్ క్యాంపు నుంచి విజ్జులూరు వరకు 8 కి.మీ
  • అడ్వెంచర్ ట్రెక్ - వలమూరు నుంచి నెల్లూరు వరకు 10 కి.మీ

మారేడుమిల్లి కార్పొరేట్ ప్యాకేజీలు

  • రాజమండ్రి/కాకినాడ నుంచి 2 రోజుల జంగిల్ స్టార్ నేచర్ క్యాంప్. ఒక్కొక్కరికి రూ.2500. రవాణా, ప్రవేశ టిక్కెట్లు, ఆహారం, డేరా వసతి అందిస్తారు.
  • రాజమండ్రి/కాకినాడ నుంచి 2 రోజుల టూర్ ప్యాకేజీ రవాణా మినహా..ప్రవేశ టిక్కెట్లు, ఆహారం, డేరా స్టే అందిస్తారు. ఒక్కొక్కరికి రూ.1750.
  • 2 డేస్ స్టూడెంట్ ట్రిప్(10వ తరగతి వరకు) రవాణా మినహా ప్రవేశ టికెట్లు, ఆహారం, డేరా స్టే అందిస్తారు. ఒక్కొక్కరికి రూ.1250.

పొల్లూరు జలపాతం

మారేడుమిల్లికి సమీపంలోని మరో పర్యాటక ప్రదేశం మోతుగూడెం పొల్లూరు జలపాతం. ఈ జలపాతం భద్రాచలంలోని లక్కవరం అటవీ ప్రాంతంలో ఉంది. ఈ జలపాతం వద్ద మూడు దశల్లో ప్రవాహాలు ఉంటాయి. వారాంతాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ అద్భుతమైన ప్రదేశానికి చేరుకోవాలంటే పర్యాటకులు తమ సొంత ఏర్పాట్లు చేసుకోవాలి. భద్రాచలం లేదా మారేడుమిల్లి నుంచి బస్సులో మోతుగూడెం వరకు వెళ్లాలి. చింతూరు నుంచి జలపాతం వరకు ఒక మట్టి రహదారి వెళుతుంది. ఈ ప్రాంతంలో సౌకర్యాలు చాలా పరిమితంగా ఉంటాయి. జలపాతానికి దగ్గరగా ఎటువంటి వసతి ఉండదు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో సందర్శకులు పోలీస్ స్టేషన్‌లో తమ వివరాలు అందించాలి.

టూర్ ప్యాకేజీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://tourism.ap.gov.in/home

సంబంధిత కథనం