AP TG Weather Alert : తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం, ద్రోణి ఎఫెక్ట్- రానున్న మూడ్రోజులు వర్షాలు
AP TG Weather Alert : ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. తెలంగాణ మూడ్రోజులు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడ అల్పపీడనం ఈ నెల 24 కు వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
AP TG Weather Alert : భారత వాతావరణ శాఖ అంచనాలు ప్రకారం బుధవారం ఉదయం 8 గంటలకు ఉత్తర తమిళనాడు-దక్షిణకోస్తా తీరాలకు ఆనుకుని నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ, శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ఇవాళ దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులలోని మరికొన్ని ప్రాంతాలు, కొమోరిన్ , దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలోకి ప్రాంతాల్లో ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని ఉన్న నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. అయినప్పటికీ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిమీ వరకు విస్తరించి ఉందని పేర్కొంది. అల్పపీడనం మే 24 ఉదయం నాటికి ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, మరింత బలపడి 25 సాయంత్రం నాటికి వాయువ్య బంగాళాఖాతంలోకి చేరుకుని అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రానున్న మూడురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో గురువారం(మే 23న) మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే రేపు శ్రీకాకుళం 9, విజయనగరం 5 , మన్యం 11, అల్లూరి కూనవరం మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రకటించారు.
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నెల 23న భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణం కేంద్రం చెప్పింది.
24, 25 తేదీల్లో ఈ జిల్లాల్లో వర్షాలు
ఈ నెల 24న ములుగు, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 25న ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు మే 31వ తేదీ నాటికి కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది.
సంబంధిత కథనం