AP TET 2024 Results: నేడు ఏపీ టెట్‌ ఫలితాల విడుదల, జూలై1న మెగా డిఎస్సీ షెడ్యూల్?-ap tet result release today mega dsc schedule on july 1 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet 2024 Results: నేడు ఏపీ టెట్‌ ఫలితాల విడుదల, జూలై1న మెగా డిఎస్సీ షెడ్యూల్?

AP TET 2024 Results: నేడు ఏపీ టెట్‌ ఫలితాల విడుదల, జూలై1న మెగా డిఎస్సీ షెడ్యూల్?

Sarath chandra.B HT Telugu

AP TET 2024 Results: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-2024) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. జూలై1న మెగా డిఎస్సీ షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

నేడు ఏపీ టెట్ ఫలితాల విడుదల

AP TET 2024 Results: ఏపీ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు ఏపీలో టెట్ పరీక్షల్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.67లక్షల మంది టెట్ పరీక్షలకు దరఖాస్తు చేయగా న 2.35 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాల విడుదల వాయిదా పడ్డాయి.

ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఇప్పటికే టెట్ రెస్పాన్స్ షీట్లు, ఫైనల్ కీ విడుదల అయ్యాయి. ఫలితాలు కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో టెట్‌ ఫలితాల విడుదలకు అనుమతించారు.

ఏపీ టెట్-2024 నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 7న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించింది. ‌ఫిబ్రవరి 23 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఏపీ టెట్ పరీక్షలు మార్చి 9న ముగిశాయి. టెట్ పరీక్ష అర్హత సాధిస్తే డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ వస్తుంది.‌

ముందుగా విడుదల చేసి‌న షెడ్యూల్ ప్రకారం మార్చి 14న టెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఏపీ టెట్ ఫలితాలు విడుదలకు బ్రేక్ పడింది.‌ ఫలితాలు విడుదల కోసం అభ్యర్థులు మూడు నెలలకు పైగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు కాగానే మెగా డిఎస్సీ ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేయడంతో అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు.

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నేడు ఏపీ టెట్ ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి.‌ ఏపీ టెట్ ఫలితాలకు సంబంధించి పరీక్ష ఫలితాలను అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చూడొచ్చు.

జూలైలో మెగా డిఎస్సీ షెడ్యూల్?

మరోవైపు ఏపీలో మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి క్యాబినెట్ అమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ దస్త్రంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం కూడా చేశారు. 16వేల డీఎస్సీ పోస్టులను ఈ ఏడాది డిసెంబర్ కల్లా రిక్రూట్ చేయాలని డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారు.

టెట్‌ ఫలితాలను తెలుసుకోండి ఇలా…

టెట్ పరీక్ష అర్హత సాధిస్తే డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ వస్తుంది.‌ మెగా డిఎస్సీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనుండటంతో మరో టెట్ ఉంటుందో లేదో స్పష్టత రావాల్సి ఉంది. ఏటా రెండు విడతల్లో టెట్‌ పరీక్షల్ని నిర్వహించాల్సి ఉండగా గత

అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

హోమ్ పేజీలో కనిపించే AP TET Feb-2024 Results ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీ లాగిన్ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.

మీ టెట్ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

డీఎస్సీ రిక్రూట్ మెంట్ ప్రక్రియ టెట్ స్కోర్ కీలకం కాబట్టి... స్కోరు కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలి.