AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ 2024 ఫలితాలు విడుదల, ఎల్లుండి మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌…-ap tet 2024 results will be released soom day after tomorrw mega dsc notification ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet 2024 Results: మరికాసేపట్లో టెట్ 2024 ఫలితాలు విడుదల, ఎల్లుండి మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌…

AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ 2024 ఫలితాలు విడుదల, ఎల్లుండి మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌…

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 04, 2024 05:48 AM IST

AP TET 2024 Results: ఏపీలో టెట్ 2024 ఫలితాలను మంత్రి నారా లోకేశ్ నేడు విడుదల చేయనున్నారు.అక్టోబర్ నెల 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 3,68,661 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇటీవల టెట్ ఫైనల్ కీని కూడా విద్యాశాఖ విడుదల చేసింది.

నేడు ఏపీ టెట్ 2024 ఫలితాలు విడుదల
నేడు ఏపీ టెట్ 2024 ఫలితాలు విడుదల

AP TET 2024 Results: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మానవ వనరుల శాఖ మంత్రి నారాలోకేష్‌ టెట్ ఫలితాలు విడుదల చేశారు. పరీక్షలు ముగిసిన రెండు వారాల్లోపే ఫలితాలను విడుదల చేస్తున్నారు. డిఎస్సీకి అర్హత కల్పించే క్రమంలో నిర్వహించిన టెట్ పరీక్షలకు 3,68,661మంది హాజరయ్యారు.మరోవైపు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఈ వారంలోనే ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.దీని ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు సోమవారం నవంబర్ 4వ తేదీన విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అక్టోబర్ 21న ఏపీలో టెట్‌ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పరీక్షల ఫైనల్ కీ కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిపై అభ్యంతరాలను స్వీకరించిన విద్యాశాఖ ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది.

ఏపీ టెట్ పరీక్షలు మొత్తం 17 రోజల పాటు జరిగాయి. ప్రతి రోజు 2 విడతలుగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేయగా, 3,68,661 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఫలితాలు వెలువడాల్సి ఉన్నా విద్యాశాఖ మంత్రి అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేశారు. దీంతో ఎట్టకేలకు ఫలితాలను విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. టెట్ ఫలితాలు విడుదల కావడంతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 6వ తేదీన డిఎస్సీ 2024 నోటిఫికేష్ విడుదల కానుంది.

ఫలితాలు ఇలా..

Step 1 : టెట్ రాసిన అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

Step 2 : హోం పేజీలో కనిపించే AP TET Results - 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3 : మీ వివరాలను ఎంట్రీ చేయాలి. సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ టెట్ స్కోర్ డిస్ ప్లే అవుతుంది.

Step 4 : ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

త్వరలో డీఎస్సీ..

మరోవైపు మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ ఈ వారంలోనే విడుదల కానుంది. ఈ మేరకు ఏపీ సర్కార్ కసరత్తు దాదాపు పూర్తి చేసింది. ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు.

టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అధికారులు అభిప్రాయ సేకరణ చేశారు. ఇప్పటికే ఆశావహులు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగాలు మానుకుని పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ఉద్యోగ ప్రకటన చేసిన ఆర్నెల్లకు మించి ఆలస్యమైతే అభ్యర్థులకు భారమవుతుందని భావించారు. దీంతో నవంబర్‌లోనే డిఎస్సీ పరీక్షల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 6వ తేదీన డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

తాజాగా వచ్చే నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి. అధికారికంగా విద్యాశాఖ విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారా ఖాళీలపై స్పష్టత రానుంది.

Whats_app_banner