AP TET Results 2024: రేపు విడుదల కానున్న ఏపీ టెట్ 2024 రిజల్ట్స్‌, ఈ వారంలోనే డిఎస్సీ నోటిఫికేషన్-ap tet 2024 results to be released tomorrow dsc notification within this week ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet Results 2024: రేపు విడుదల కానున్న ఏపీ టెట్ 2024 రిజల్ట్స్‌, ఈ వారంలోనే డిఎస్సీ నోటిఫికేషన్

AP TET Results 2024: రేపు విడుదల కానున్న ఏపీ టెట్ 2024 రిజల్ట్స్‌, ఈ వారంలోనే డిఎస్సీ నోటిఫికేషన్

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 01, 2024 09:15 AM IST

AP TET Results 2024: ఏపీ టెట్‌ 2024 ఫలితాలు నవంబర్ 2వ తేదీన విడుదల కానున్నాయి. ఇప్పటికే టెట్ 2024 ఫైనల్‌ కీని ఏపీ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. మూడున్నర లక్షల మందికి పైగా అభ్యర్థులు టెట్‌ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను శనివారం విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు.

రేపే ఏపీ టెట్ ఫలితాలు విడుదల
రేపే ఏపీ టెట్ ఫలితాలు విడుదల

AP TET Results 2024: ఏపీ టెట్‌ 2024 పరీక్ష ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. అక్టోబర్ 21న టెట్‌ పరీక్షలు ముగిశాయి. పరీక్షలు ముగిసిన పదిరోజుల్లోనే ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.

త్వరలో ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కానుండటంతో ఉపాధ్యాయ ఉద్యోగాల్లో అర్హత సాధించేందుకు లక్షలాది మంది అభ్యర్థులు గత మూడు నెలలుగా శ్రమిస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్న వారు టీచర్ పోస్టుల కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి శ్రమిస్తున్నారు. ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ముఖ్యమంత్రి సంతకం చేయడంతో లక్షలాదిమంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. డిఎస్సీలో వీలైనంత ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు మరోసారి టెట్‌ పరీక్షను కూడా నిర్వహించారు. ఈ ఫలితాలను నవంబర్ 2వ తేదీన విడుదల కానున్నాయి.

ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా చివరి రోజు అక్టోబర్ 21న ఉదయం, పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర విభాగంలో నిర్వహించారు. మధ్యాహ్నం పేపర్-2బి ప్రత్యేక విద్య విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 11877 మందికి గాను 9844 మంది అభ్యర్థులు హాజరయ్యారు. చివరిరోజు 82.88 శాతం మంది హాజరయ్యారు.

ఉదయం 38 సెంటర్లలో జరిగిన పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 9441 మందికి గాను 7886 మంది అనగా 83.53 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 17 సెంటర్లలో జరిగిన పేపర్-2బి ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు 2436 మందికి గాను 1958 మంది అనగా 80.38 శాతం మంది హాజరయ్యారు. పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర, పేపర్-2బి ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షల రెస్పాన్స్ షీట్లు మరియు ప్రాథమిక కీ అక్టోబర్ 23 నుండి వెబ్సైటులో అందుబాటులో ఉంటాయి.

ఫలితాలు నవంబర్ 2న విడుదల…

ఏపీ టెట్‌ ఫలితాలు నవంబర్ 2వ తేదీన విడుదల కానున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ నవంబర్ మొదటి వారంలోనే విడుదల కానుంది. డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ను నవంబరు 3న విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ‘టెట్ పరీక్షల ఫలితాలను నవంబరు 2న ప్రకటిస్తారు.

టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఇప్పటికే ఆశావహులు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగాలు మానుకుని పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ఉద్యోగ ప్రకటన చేసిన ఆర్నెల్లకు మించి ఆలస్యమైతే అభ్యర్థుగా భారమవుతుందని భావించారు. దీంతో నవంబర్‌లోనే డిఎస్సీ పరీక్షల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 6వ తేదీన డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

పోస్టుల వివరాలు…

తాజాగా వచ్చే నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం