AP Telangana Rains : రాగల 36 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన-ap telangana weather update low depression in bay of bengal heavy rains in telugu states ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Telangana Rains : రాగల 36 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

AP Telangana Rains : రాగల 36 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Bandaru Satyaprasad HT Telugu
Nov 09, 2024 11:30 PM IST

AP Telangana Rains : రాగల 36 గంట్లలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో నవంబర్ 12-15 మధ్య రాయలసీ, దక్షిణకోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

రాగల 36 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
రాగల 36 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత రెండు రోజుల్లో అల్పపీడనం పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదులుతుందని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పుమధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ద్రోణి ప్రభావంతో నవంబర్ 12-15 మధ్యలో (మంగళ, బుధ, గురువారాల్లో) రాయలసీమ, దక్షిణకోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఏపీలో వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 12-15 వరకు నాలుగు రోజుల పాటు ఏపీ, తమిళనాడు, కేరళలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. గత 24 గంటల్లో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. నవంబర్ 9-15 మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మాహేలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 12, 13 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించారు.

తెలంగాణలో

ఈ నెల 12-15 తేదీల మధ్య తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది.

Whats_app_banner