ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్ -రేపు ఈ జిల్లాల్లో వడగాలులు, వర్షాలు-ap telangana weather tomorrow heatwave alert rainfall forecast for these districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్ -రేపు ఈ జిల్లాల్లో వడగాలులు, వర్షాలు

ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్ -రేపు ఈ జిల్లాల్లో వడగాలులు, వర్షాలు

ఏపీ, తెలంగాణను ఎండలు, వానలు కుమ్మేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరువలో నమోదు అవుతున్నాయి. రేపు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వడగాలులు, పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్ -రేపు ఈ జిల్లాల్లో వడగాలులు, వర్షాలు

ఏపీ, తెలంగాణను ఎండలు, వానలు కుమ్మేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరువలో నమోదు అవుతున్నాయి. రేపు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వడగాలులు, పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, వర్షాలు ప్రజలను అల్లాడిస్తున్నాయి. వడగాలుల ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే...అకాల వర్షాలతో రైతన్న ఆందోళన చెందుతున్నారు.

ఏపీ వెదర్ రిపోర్ట్

ఆంధ్రప్రదేశ్ లో గురువారం అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

రేపు ఈ మండలాల్లో వడగాలులు

అలాగే రేపు(మే 15) ఉష్ణోగ్రతలు 41-43°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. మన్యం జిల్లా గరుగుబిల్లిలో తీవ్ర వడగాలులు, శ్రీకాకుళం జిల్లాలోని ఒక మండలనం, విజయనగరం-16, పార్వతీపురంమన్యం-10, అల్లూరి-1, కాకినాడ-5, తూర్పుగోదావరి-1 మండలాల్లో(మొత్తం 34) వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

నేటి అత్యధిక ఉష్ణోగ్రత

ఇవాళ ప్రకాశం జిల్లా కొనకనమిట్ల, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.8°C గరిష్ఠ ఉష్ణోగ్రత, అలాగే శ్రీకాకుళం జిల్లా జగ్గిలిబొంతులో 53.5 మిమీ, రాగోలులో 49.2మిమీ వర్షపాతం నమోదైంది.

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు

తెలంగాణ రాష్ట్రంలో రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 50-60 కి.మీ)తో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40-50 కి.మీ)తో కూడిన వర్షాలు మంచిర్యాల, రంగారెడ్డి, హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

పలు జిల్లాల్లో వర్షాలు

ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఎల్లుండి వాతావరణం ఇలా

ఎల్లుండి తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 50-60 కి.మీ)తో కూడిన వర్షాలు నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం