AP TG Heatwave : ఏపీ, తెలంగాణలో హీట్ వేవ్ అలర్ట్- రేపు 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, ప్రజలకు అడ్వైజరీ
AP TG Heatwave : ఏపీ, తెలంగాణలో సూర్యుడు తీవ్రరూపం దాల్చాడు. రేపు ఏపీలోని 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అధికారులు తెలిపారు. అలాగే తెలంగాణలో సాధారణంగా కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించారు.
AP TG Weather : తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్ర పెరుగుతోంది. ఏపీలో గురువారం 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రేపు శ్రీకాకుళం జిల్లాలో 13, విజయనగరం జిల్లాలో 14, పార్వతీపురం మన్యం జిల్లాలో 11, అనకాపల్లి జిల్లాలో 2, కాకినాడలో 4, తూర్పుగోదావరిలో 2, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
రేపు 199 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో 40.8°C, కర్నూలు జిల్లా కమ్మరచేడులో 40.7°C, చిత్తూరు జిల్లా నిండ్రలో 40.1°C, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 40°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు.
తెలంగాణలో తీవ్రమైన ఎండలు
తెలంగాణలో రాగల మూడు రోజులు పొడివాతావరణ ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 2-3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు అవుతాయని పేర్కొంది.
ప్రజలకు సూచనలు
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచనల ప్రకారం తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత 2-3°C వరకు క్రమంగా పెరుగుతుందని అంచనా వేసింది.
చేయవలసినవి
• హైడ్రేటెడ్ గా ఉండండి: దాహం వేయకపోయినా, వీలైనంత వరకు తగినంత నీరు తాగండి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) తీసుకోండి. నిమ్మకాయ నీరు, పాలు, చక్కెర ద్రావణం, పండ్ల రసాలు మొదలైన ఇంట్లో తయారుచేసిన పానీయాలను తీసుకోండి.
*ప్రయాణ సమయంలో వెంట నీటిని తీసుకెళ్లండి. పుచ్చకాయ, నారింజ, ద్రాక్ష, పైనాపిల్స్, దోసకాయలు, స్థానికంగా లభించే ఇతర పండ్లు, కూరగాయలు వంటి అధిక నీటి శాతం కలిగిన పండ్లు, కూరగాయలను తినండి.
-సన్నని వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించండి. లేత రంగు దుస్తులు ధరించండి.
- ప్రత్యక్షంగా సూర్యకాంతికి గురయ్యేటప్పుడు గొడుగు, టోపీ, టవల్, తలపాగాలను ఉపయోగించండి.
-ఎండలో బయటకు వెళ్లేటప్పుడు బూట్లు లేదా చెప్పులు ధరించండి.
• వీలైనంత వరకు ఇంటి లోపల ఉండండి.
-బాగా వెంటిలేషన్ ఉన్న, చల్లని ప్రదేశాలలో ఉండండి.
-మీ ఇంటిలో పగటిపూట, ముఖ్యంగా ఎండ వైపున కిటికీలు, కర్టెన్లను మూసివేయండి. చల్లని గాలి లోపలికి వచ్చేలా రాత్రిపూట వాటిని తెరవండి.
-మీరు బయటకు వెళ్లాల్సి వస్తే ఉదయం, సాయంత్రం సమయాల్లో వెళ్లండి.
-వంట ప్రాంతాన్ని తగినంతగా వెంటిలేట్ చేయడానికి తలుపులు, కిటికీలను తెరవండి
• అప్రమత్తంగా ఉండండి:
-స్థానిక వాతావరణ వార్తల సమాచారం తెలుసుకోండి. భారత వాతావరణ శాఖ (IMD) వెబ్‌సైట్‌లో https://mausam.imd.gov.in/ వాతావరణానికి సంబంధించిన తాజా వివరాలు పొందవచ్చు.
చేయకూడనివి
• ఎండలో బయటకు వెళ్లకుండా ఉండండి. ముఖ్యంగా మధ్యాహ్నం 12:00 నుంచి 03:00 గంటల మధ్య బయటకు వెళ్లకండి.
• మధ్యాహ్నం సమయంలో కార్యకలాపాలకు దూరంగా ఉండండి.
• చెప్పులు లేకుండా బయటకు వెళ్లవద్దు
• వంట చేసే ప్రదేశానికి తగినంత గాలి వచ్చేలా తలుపులు, కిటికీలు తెరవండి.
• ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలు లేదా ఎక్కువ మొత్తంలో చక్కెర కలిగిన పానీయాలు తీసుకోవడం మానుకోండి. ఎందుకంటే ఇవి వాస్తవానికి శరీరాన్ని డీహైడ్రేట్ చస్తాయి.
• అధిక ప్రోటీన్, ఉప్పు, కారం, నూనెతో కూడిన ఆహారాన్ని నివారించండి.
వడదెబ్బ ప్రమాద సంకేతాలు
• వికారం, వాంతులు
• వేడి, ఎరుపు, పొడి చర్మం
• శరీర ఉష్ణోగ్రత ≥40 C లేదా 104 F
• తలనొప్పి
• ఆందోళన, మైకం, మూర్ఛపోవడం
• కండరాల బలహీనత లేదా తిమ్మిరి
• గుండె వేగంగా కొట్టుకోవడం
• వేగవంతమైన శ్వాస
• గందరగోళం, ఆందోళన, చిరాకు, అటాక్సియా, మూర్ఛ, కోమా
ఈ స్థితులను గమనించినట్లయితే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల నుంచి తక్షణ వైద్య సహాయం తీసుకోండి. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా, ప్రభుత్వం అన్ని ప్రజారోగ్య కేంద్రాలలో ప్రత్యేక పడకలు, IV ద్రవాలు, అవసరమైన మందులను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
సంబంధిత కథనం