AP TG Weather Report : తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం వర్షాలు, మూడు రోజులు కుండపోతే- వరి కోతలు వద్దని సూచన-ap telangana weather report low pressure rains in many districts next three days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tg Weather Report : తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం వర్షాలు, మూడు రోజులు కుండపోతే- వరి కోతలు వద్దని సూచన

AP TG Weather Report : తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం వర్షాలు, మూడు రోజులు కుండపోతే- వరి కోతలు వద్దని సూచన

Bandaru Satyaprasad HT Telugu
Nov 12, 2024 03:22 PM IST

AP TG Weather Report : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రాలు చెబుతున్నాయి. రైతులు కోతలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం వర్షాలు, మూడు రోజులు కుండపోతే- వరి కోతలు వద్దని సూచన
తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం వర్షాలు, మూడు రోజులు కుండపోతే- వరి కోతలు వద్దని సూచన

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆవర్తనం ఎఫెక్ట్ తో ఏపీ, తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు, నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి. ఏపీలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి వాతావరణం మబ్బులు పట్టి, మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. అలాగే చలిగాలి తీవ్రత సైతం పెరిగింది. రానున్న మూడు రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

అల్పపీడనం వర్షాలు

అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, సరిహద్దులోని దక్షిణ ఏపీలోని తీర ప్రాంతంలో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. అదే విధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. నేడు, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. నంద్యాల, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోతల సమయం కావడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. వరి కోతలు వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు.

నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి నగరం, శ్రీకాళహస్తి, గూడూరు వంటి ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం వరకు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్ష సూచన చేసింది ఐఎండీ. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇతర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉన్నట్లు తెలిపింది. తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మెదక్ జిల్లాలో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. నగరాన్ని ఉదయం పూట పొగమంచు కప్పేస్తుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా రికార్డు అవుతుంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

పలు జిల్లాల్లో పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదు అవుతున్నాయని అధికారులు తెలిపారు. ఉపరితల గాలులు ఈశాన్య తూర్పు దిశలో గంటకు నాలుగు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం