తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ పక్క ఎండలు మండిపోతుంటే మరో వైపు మబ్బులు రైతులను భయపెడుతున్నాయి. ఆదివారం ఏపీ, తెలంగాణలోని వాతావరణ పరిస్థితులపై స్థానిక వాతావరణ కేంద్రాల రిపోర్ట్ ఇలా ఉంది.
ఆదివారం అల్లూరి జిల్లా కూనవరం, కాకినాడ జిల్లా జగ్గంపేట, కిర్లంపూడి, ఏలేశ్వరం మండలాల్లో తీవ్రవడగాలులు, 17 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇవాళ వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో42.5°C, నంద్యాల జిల్లా గోస్పాడులో42.2°C, 95 ప్రాంతాల్లో40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు తెలిపారు. అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో నేడు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలలో రాత్రిపూట వేడి వాతావరణ పరిస్థితులు అక్కడక్కడ ఏర్పడే అవకాశం ఉంది.
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 50-60 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40-50 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల మరియు కరీంనగర్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆదివారం తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు{గాలి వేగం గంటకు 50-60 కి.మ}తో కూడిన వర్షాలు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాత్రిపూట వేడి వాతావరణ పరిస్థితులు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40-50 కి. మీ)తో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఖమ్మం , హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సంబంధిత కథనం