AP Telangana Weather : తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోన్న చలి తీవ్రత, ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడే ఛాన్స్-నేటి వెదర్ రిపోర్ట్-ap telangana today weather report november 20 forecast temperature decreasing ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Telangana Weather : తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోన్న చలి తీవ్రత, ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడే ఛాన్స్-నేటి వెదర్ రిపోర్ట్

AP Telangana Weather : తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోన్న చలి తీవ్రత, ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడే ఛాన్స్-నేటి వెదర్ రిపోర్ట్

Bandaru Satyaprasad HT Telugu
Nov 20, 2024 05:42 AM IST

AP Telangana Weather : ఏపీ, తెలంగాణలో ఇవాళ వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షసూచన చేయలేదు కానీ చలితీవ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోన్న చలి తీవ్రత, ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడే ఛాన్స్
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోన్న చలి తీవ్రత, ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడే ఛాన్స్

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉదయం 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో పొగ మంచు కనిపిస్తుంది. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటి పూట ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఉత్తరాది రాష్ట్రాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. ఏపీ, తెలంగాణలో ఇవాళ(నవంబర్ 20) ఎలాంటి వర్ష సూచనా లేదని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం కనిపిస్తుందని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.

మరో అల్పపీడనం

నవంబర్ 21వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ఆవర్తనం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి నవంబర్ 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పింది. ఆ తదుపరి 2 రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య/తూర్పు గాలులు వీస్తున్నాయన్నారు.

నేటి వాతావరణం ఎలా?

వాతావరణ శాఖ అంచనాల మేరకు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఉంటాయి. దక్షిణ రాయలసీమలో మాత్రం అక్కడక్కడా వాతావరణం మేఘావృతమై కనిపిస్తుంది. ఎక్కువ శాతం వాతావరణం పొడిగా ఉంటుంది. ఎక్కడా వర్షం కురిసే అవకాశం కూడా లేదు. చలిగాలుల వేగం కొంత మేర పెరిగింది.

తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో గరిష్టంగా గంటకు 11 కిలోమీటర్ల వేగంతో మేర గాలులు వీస్తాయి. ఏపీలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలో ఇవాళ పగటి పూట ఉష్ణోగ్రత గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్, ఏపీలో గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉంది. రాత్రి సమయంలో తెలంగాణలో 17 డిగ్రీల సెల్సియస్, ఏపీలో 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. దీంతో రాత్రివేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. హైదరాబాద్, రామగుండం, నిజామాబాద్ జిల్లాల్లో పొంగ మంచు దట్టంగా కనిపిస్తుంది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం