తెలుగు రాష్ట్రాలపై ద్రోణి ఎఫెక్ట్- రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ-ap telangana heavy rain warning several districts yellow alert for thursday ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  తెలుగు రాష్ట్రాలపై ద్రోణి ఎఫెక్ట్- రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

తెలుగు రాష్ట్రాలపై ద్రోణి ఎఫెక్ట్- రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు(గురువారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాలపై ద్రోణి ఎఫెక్ట్- రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

పశ్చిమ మధ్య బంగాళాఖాతం,ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా,రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి కొనసాగుతోంది. ఆవర్తనం ప్రభావంతో గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

విజయనగరం, మన్యం, అల్లూరి, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ రాత్రి 7 గంటల నాటికి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 52 మి.మీ, అనంతపురం జిల్లా చిన్నమూష్టరులో 51.5 మిమీ వర్షం కురింది.

ఏపీ జిల్లాల్లో భారీ వర్షాలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 50 మి.మీ, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో 48 మి.మీ, కృష్ణా జిల్లా గిలకలడిందిలో 47 మి.మీ, మరో 43 ప్రాంతాల్లో 30 మి.మీకు పైగా వర్షపాతం రికార్డైంది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలో, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించాయని ఐఎండీ తెలిపింది.

రాబోయే 3-4 రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని ఐఎండీ పేర్కొంది.

ఉపరితల ఆవర్తనం

ఆంధ్రప్రదేశ్, దక్షిణ తెలంగాణపై ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాగల ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

బుధవారం రాత్రి 10 గంటల వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. హైదరాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, పెద్దపల్లి, సిద్ధిపేట, సిరిసిల్ల, వికారాబాద్, భువనగిరి, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

గురువారం కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడతాయని తెలిపింది.

కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది.

ఎల్లో అలర్ట్

అలాగే, శుక్ర, శని, ఆదివారాల్లోనూ హైదరాబాద్‌ సహా ఉత్తర, దక్షిణ తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో వానలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది.

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

బుధవారం రాత్రి హైదరాబాద్ లోని పలు చోట్ల వర్షం కురిసింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, షేక్‌పేట్‌, మాదాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, బేగంపేట, అమీర్‌పేట, ఉప్పల్, రామంతాపూర్, మేడిపల్లి, బోడుప్పల్ సహాపలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఆల్వాల్, మేడ్చల్ కుండపోత వర్షం కురిసింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన చేశారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం