Floods : వరదల సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Floods : తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఇళ్లు నీట మునిగి ప్రజల పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మరికొందరు ఇళ్లపై చేరి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద సమయంలో, ఆ తర్వాత పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
వరదల సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Floods : తెలుగు రాష్ట్రాలపై ప్రకృతి కన్నెర్ర చేసింది. భారీ వర్షాలకు వాగులు పొంగి వరదలు సంభవించాయి. విజయవాడ, ఖమ్మంతో పాటు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. లక్షల మంది కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. వరదల సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను విపత్తుల నిర్వహణ సంస్థలు చూస్తున్నాయి.
వరదల సమయంలో
- వరద నీటిలోకి వెళ్లవద్దు
- మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండండి.
- విద్యుదాఘాతానికి గురికాకుండా విద్యుత్ స్తంభాలు, పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలి.
- ఓపెన్ డ్రెయిన్ లేదా మ్యాన్ హోల్స్ ను గుర్తించి ఆ ప్రదేశంలో కనిపించే విధంగా చిహ్నాలు, ఎర్ర జెండాలు, బారికేడ్లలను ఉంచండి.
- వరద నీటిలో నడవకండి, డ్రైవ్ చేయవద్దు. రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను సైతం తోసుకుపోగలవు గుర్తించుకోండి.
- తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని తీసుకోండి. మీ ఆహారాన్ని ఎప్పుడూ ప్లైట్/కవర్ తో మూసి ఉంచండి.
- వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు తాగండి.
- మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి క్రిమిసంహరక మందులను వాడండి.
వరదల తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- మీ పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో నీటిలో గానీ, వరద నీటి సమీపంలోకి ఆడటానికి పంపకండి.
- దెబ్బతిన్న విద్యుత్ వస్తువులను ఉపయోగించవద్దు. వాటిని తనిఖీ చేయండి.
- అధికారులు సూచించిన వెంటనే కరెంటకు సంబంధించి ఎలాంటి పరికరాలు ఉపయోగించవద్దు. తడిగా ఉండే
- విద్యుత్ పరికరాలను తాకవద్దు.
- విరిగన విద్యుత్ స్తంభాలు, తీగలు, పదునైన వస్తువులు, శిథిలాలను నిశితంగా పరిశీలించండి.
- వరద నీరు కలిసిన ఆహారాన్ని తినవద్దు.
- మలేరియా వంటి వ్యాధులను నివారించడానికి దోమతెరలను వాడండి.
- వరద సమయంలో పాము కాటు సాధారణం కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పాముకాటుకు ప్రథమ చికిత్స చేసుకుని వైద్యులను సంప్రదించండి.
- నీరు తాగడానికి సురక్షితమని ఆరోగ్యశాఖ సలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగవద్దు.
- వరదల తర్వాత అంటువ్యాధులు ప్రబలకుండా ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకోవాలి.
సంబంధిత కథనం