AP TG Sensational Crimes : 2024 రౌండప్-తెలుగు రాష్ట్రాల్లో సంచలన నేర సంఘటనలు
AP TG Sensational Crimes : తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది నేరాలు పెరిగాయని పోలీసుల నివేదికలు చెబుతున్నాయి. ఏపీ, తెలంగాణ 2024లో జరిగిన పలు సంచలన ఘటనలు ఒకసారి పరిశీలిద్దాం.
AP TG Sensational Crimes : తెలుగు రాష్ట్రాల్లో 2024 ఏడాదిలో క్రైమ్ పెరిగిందని పోలీసుల వార్షిక క్రైమ్ నివేదికల చెబుతున్నాయి. ఏపీ, తెలంగాణలో 2024లో కొన్ని సంచలన ఘటనలు చోటుచేసుకున్నాయి. హత్య, అత్యాచారాలు, కిడ్నాప్ లు, బాలికపై దారుణాలకు లెక్కేలేదు. 2024 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పలు సంచలన క్రైమ్ సంఘటనలు చూద్దాం.
బాలికపై మైనర్ల హత్యాచారం
ఈ ఏడాది జులైలో ఏపీలోని నంద్యాల జిల్లాల్లో అత్యంత దారుణ ఘటన జరిగింది. 8 ఏళ్ల బాలిక ముగ్గురు మైనర్లు సామూహిక హత్యాచారం చేశారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఈ దారుణం జరిగింది. ముగ్గురు బాలురు 8 ఎనిమిదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి నిర్మూనుష ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. మైనర్ల తండ్రులు బాలిక మృతదేహాన్ని గడ్డిలో పెట్టి వనమలపాడుకు బైకు మీద తీసుకెళ్లారు. అక్కడి నుంచి పుట్టిలో తీసుకెళ్లి బాలిక మృతదేహానికి రాయి కట్టి కృష్ణా నదిలో పడేశారు. ముచ్చుమర్రి ఘటన సంచలన అయ్యింది. బాలిక మృతదేహం కోసం రోజుల పాటు వెదికినా లభ్యం కాలేదు.
విద్యార్థినిపై పెట్రోల్ దాడి
కడప జిల్లా బద్వేలు సమీపంలో విద్యార్థినిపై పెట్రోల్ దాడి జరిగింది. ఈ ఘటనలో అక్టోబర్ నెలలో కలకలం రేపింది. బద్వేలు పట్టణంలోని రామాంజనేయనగర్‌కు చెందిన విద్యార్థిని స్థానిక ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అదే కాలనీకి చెందిన విఘ్నేశ్, విద్యార్థిని ప్రేమించుకున్నారు. ఇంతలో విఘ్నేశ్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే తనను కూడా వివాహం చేసుకోవాలని విద్యార్థిని అడడంతో...పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. తనను కలవకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి బయటకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు విఘ్నేష్. ఈ దాడిలో యువతి మృతి చెందింది.
డెడ్ బాడీ పార్సిల్
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో పార్సిల్ లో మృతదేహం కలకలం రేపింది. ఆస్తుల వివాదంతో శ్రీధర్ వర్మ అనే కాళ్ల గ్రామానికి చెందిన పర్లయ్య అనే వ్యక్తి మృతదేహాన్ని చెక్క బాక్స్ లో యండగండిలో తనకు ఆస్తి వివాదాలున్న మహిళ ఇంటికి పార్సిల్ చేశాడు. డిసెంబర్ నెలలో ఈ ఘటన చోటుచేసుకుంది. యండంగికి చెందిన తులసి, రేవతి అక్కచెల్లెళ్లు. తల్లిదండ్రులు ఆస్తుల పంపకం విషయంలో వీరి మధ్య వివాదం నెలకొంది. అయితే రేవతి భర్త శ్రీధర్ వర్మ...కాళ్లలో ఉంటున్నాడు. శ్రీధర్ వర్మ కాళ్లకు చెందిన పర్లయ్య అనే వ్యక్తిని హత్య చేసి పార్సిల్ లో మృతదేహాన్ని తులసి ఇంటికి పంపాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.ట
తెలంగాణలో
తెలంగాణలో సంచలన ఘటనలు చోటుచేసుకున్నాయి. భద్రాద్రి జిల్లాలో ప్రియురాలిని హత్య చేసి 20 ముక్కలుగా నరికి పాతిపెట్టాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంలో ఈ నేరం జరిగింది. స్వాతి అనే 30 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు కిరాతంగా హత్య చేసి మృతదేహాన్ని 20 ముక్కలుగా నరికి, ఓ గోనె సంచిలో పెట్టి పొలంలో పాతిపెట్టాడు. స్వాతి, వీరభద్రం ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పలు నేరాల్లోనూ పాలుపంచుకున్నారు. ఒకరి సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశారు. డబ్బులు తిరిగిమ్మని బాధితులు ఒత్తిడి చేయడంతో స్వాతి వీరభద్రాన్ని డబ్బు తిరిగి ఇచ్చేయాలని కోరింది. దీంతో అతడు తన ప్రియురాలిని హత్య చేసి ముక్కలుగా చేసి సమీపంలోని పొలంలో పడేశాడు. ఈ ఘటనలో నవంబర్ లో జరిగింది.
నడిరోడ్డుపై కానిస్టేబుల్ హత్య
కులంతర వివాహం చేసుకుందని సోదరిని హత్య చేశాడో తమ్ముడు. ఈ ఘటనలో రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ నాగమణిని ఆమె తమ్ముడు హత్య చేశాడు. రాయపోలు నుంచి ఎండ్లగూడ వెళ్లే రహదారిపై కాపు కాసి కానిస్టేబుల్ ను హత్య చేశాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నాగమణి..గతంలో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. విభేదాలతో భర్తతో విడాకులు తీసుకుంది. అనంతరం మరో వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న సోదరిపై దాడి చేశాడు. విధులకు వెళ్తుండగా నాగమణిని కారుతో ఢీకొట్టి వేట కొడవలితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన డిసెంబర్ నెలలో జరిగింది.
సంబంధిత కథనం