AP SI results: ఏపీ ఎస్ఐ పరీక్షల ఫలితాల విడుదల-ap sub inspector si results released on andhra pradesh state level police recruitment board website ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Sub Inspector Si Results Released On Andhra Pradesh State Level Police Recruitment Board Website

AP SI results: ఏపీ ఎస్ఐ పరీక్షల ఫలితాల విడుదల

HT Telugu Desk HT Telugu
Feb 28, 2023 10:38 AM IST

AP SI results: ఏపీ ఎస్ఐ పరీక్షల ఫలితాలను స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మంగళవారం విడుదల చేసింది.

ఎస్ఐ ప్రాథమిక పరీక్ష ఫలితాల విడుదల
ఎస్ఐ ప్రాథమిక పరీక్ష ఫలితాల విడుదల

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్‌పెక్టర్ (సివిల్) (పురుషులు, మహిళలు), రిజర్వ్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఖాళీలు భర్తీ చేసేందుకు 28.11.2022న జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి నిర్వహించిన పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

ఈ పరీక్షలకు ప్రిలిమినరీ టెస్టును 19.02.2023న 291 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 1,51,288 అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. 57,923 మంది క్వాలిఫై అయ్యారు.

క్వాలిఫైయింగ్ మార్కులు ఇలా..

ఓసీ: 40 శాతం (ప్రతి పరీక్షలో, అంటే 100కు 40 మార్కులు రావాలి)

బీసీ: 35 శాతం మార్కులు రావాలి.

ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్: 30 శాతం మార్కులు రావాలి.

అభ్యర్థికి ఒక పేపర్‌లో కూడా క్వాలిఫయింగ్ మార్కులు రానిపక్షంలో డిస్‌క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయ్యేందుకు రెండు పేపర్ల మార్కులను కలిపి లెక్కించరు.

అర్హత సాధించిన అభ్యర్థులకు పీఎంటీ, పీఈటీ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ ఆన్సర్ కీ ఫిబ్రవరి 20న విడుదల చేసినట్టు బోర్డు తెలిపింది. ఫస్ట్ పేపర్‌ ఆన్సర్ కీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని, అయితే రెండో పేపర్‌లో ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నాయని, ఫైనల్ ఆన్సర్ కీని వెబ్‌సైట్‌లో ఉంచామని వివరించింది.

స్కాన్ చేసిన ఓఎంఆర్ షీట్ మార్చి 4వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

తదుపరి ప్రక్రియ, పీఎంటీ, పీఈటీ (స్టేజ్ 2 ఆన్‌లైన్ ప్రక్రియ) కోసం వెబ్‌సైట్ సందర్శించవచ్చని స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ మనీష్ కుమార్ సిన్హా సూచించారు.

ఎస్ఐ ఫలితాల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.

IPL_Entry_Point

టాపిక్