AP SSC 10th Class Results 2025: ఆంధ్రప్రదేశ్ పదో పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఉదయం 10గంటలకు ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 81.14శాతం ఉత్తీర్ణత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93శాతం ఉత్తీర్ణత నమోదైంది.
https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-ssc-10th-result
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలను ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. వాట్సాప్ మనమిత్ర, లీప్ అప్లికేషన్, వెబ్‌సైట్‌లలో ఫలితాలను అందుబాటులో ఉంచారు.
ఈ ఏడాది ఏపీలో 6,14, 459మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 81.14శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురలో 78.31శాతం, బాలికల్లో 84.09శాతం ఉత్తీర్ణత నమోదైంది.
రాష్ట్ర వ్యాప్తంగా 1680 పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత నమోదైంది. 19పాఠశాలల్లో 0శాతం ఉత్తీర్ణత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90శాతం ఉత్తీర్ణులు అయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 47.64శాతం ఉత్తీర్ణత నమోదైంది.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను సైతం విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://www.bse.ap.gov.in/ , https://apopenschool.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
ఏపీ ప్రభుత్వం పౌరసేవల్ని అందిస్తున్న వాట్సాప్ మనమిత్ర నంబరులో పది పలితాలు కూడా తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనం