AP SC Loans : ఎస్సీలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, సబ్సిడీపై రుణాలు- దరఖాస్తు విధానం, అర్హతలు, ముఖ్యమైన తేదీలివే
AP SC Corporation Loans : ఏపీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద ఎస్సీలకు సబ్సిడీ రుణాలు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు మే 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, ఇతర వివరాలను తెలుసుకుందాం.

AP SC Corporation Loans : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత, స్వయం ఉపాధి పథకాలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఏప్రిల్ 11 నుంచి ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభించింది. తాజాగా ఆన్ లైన్ అప్లికేషన్లు ఓపెన్ అయ్యాయి. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు స్వయం ఉపాధిపై రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు మే 10 చివరి తేదీగా ప్రకటించారు. అభ్యర్థులు https://apobmms.apcfss.in/ వెబ్ సైట్ లో స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏ రంగాల్లో
వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ, రవాణా, పరిశ్రమలు, సేవా, వ్యాపార రంగాలలో స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఎస్సీల కోసం ఆర్థిక సహాయ పథకాలకు దరఖాస్తులు 10-05-2025 వరకు ఓపెన్ చేసి ఉంటాయి.
అర్హతలు
- లబ్ధిదారుడు ఏదైనా ఎస్సీ వర్గానికి చెందినవారై ఉండాలి.
- కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి.
- లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారై ఉండాలి.
- వయస్సు పరిమితి 21 నుంచి 50 సంవత్సరాలు
- లబ్ధిదారుడు దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) వర్గంలో ఉండాలి.
- లబ్ధిదారుడు స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- డి.ఫార్మసీ / బీ.ఫార్మసీ / ఎం.ఫార్మసీ ఫర్ జెనరిక్ ఫార్మసీస్ స్కీమ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
రంగం పేరు- పథకం వివరాలు- విద్యార్హతలు
ఐఎస్బీ రంగం(పరిశ్రమలు, సేవలు, వ్యాపార రంగం)
1. పూల బొకే తయారీ & అలంకరణ- విద్యార్హతలు లేవు
2. వర్మీ కంపోస్టింగ్ & సేంద్రీయ ఎరువులు- విద్యార్హతలు లేవు.
3. వెబ్‌సైట్ అభివృద్ధి & ఐటీ సేవలు- కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సంబంధిత రంగంలో ఐటీఐ, డిప్లొమా లేదా తత్సమాన అర్హత.
4. ఎల్ఈడీ బల్బ్ & ఎనర్జీ సేవింగ్ డివైస్ అసెంబ్లింగ్- ఐటీఐ, డిప్లొమా లేదా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, లేదా మెకానికల్ ఇంజినీరింగ్ లేదా సంబంధిత సాంకేతిక రంగంలో గ్రాడ్యుయేట్
5. ప్లంబింగ్ & ఎలక్ట్రీషియన్ సర్వీసెస్- ITI/ప్లంబింగ్, ఎలక్ట్రికల్ లేదా సంబంధిత ట్రేడ్‌లలో డిప్లొమా
6. వాటర్ బాటిల్ రీఫిల్ & ప్యూరిఫికేషన్ కియోస్క్- కనీసం 10వ తరగతి విద్యార్హత
7. వేస్ట్ రీసైక్లింగ్ & అప్‌సైక్లింగ్ వ్యాపారం- విద్యార్హత ప్రమాణాలు లేవు
8. మొబైల్ రిపేరింగ్ & ఎలక్ట్రానిక్ సర్వీసెస్- ఐటీఐ/డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్/మెకానికల్
9. సబ్బు, డిటర్జెంట్ & తయారీ- విద్యార్హత ప్రమాణాలు లేవు
10. చేపల పెంపకం (ఆక్వాకల్చర్)- విద్యార్హత ప్రమాణాలు లేవు
11. అడ్వెంచర్ టూరిజం (ట్రెక్కింగ్ & క్యాంపింగ్) -గ్రాడ్యుయేషన్
12. మొబైల్ కార్ వాష్ & సర్వీస్- ITI/డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్/మెకానికల్
13. బేకరీ & కన్ఫెక్షనరీ యూనిట్-విద్యార్హత ప్రమాణాలు లేవు
14. బ్రిక్ క్లిన్ & ఫ్లై యాష్ బ్రిక్ ప్రొడక్షన్- విద్యార్హత ప్రమాణాలు లేవు
15. సెరికల్చర్ (సిల్క్ ప్రొడక్షన్)- అర్హత ప్రమాణాలు లేవు
16. నీటి శుద్ధీకరణ & RO ప్లాంట్ సెటప్- ఐటీఐ/డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్/మెకానికల్
17. వెల్డింగ్ & ఫ్యాబ్రికేషన్ యూనిట్- ఐటీఐ/డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్/మెకానికల్
18. జూట్ బ్యాగ్ & ఎకో-ఫ్రెండ్లీ ప్రొడక్ట్ తయారీ -అర్హత ప్రమాణాలు లేవు
19. సోలార్ ఎనర్జీ ప్రొడక్ట్ సేల్స్ & ఇన్‌స్టాలేషన్- ఐటీఐ/డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్/మెకానికల్ లేదా రిలేటెడ్
20. సోలార్ ప్యానెల్ అసెంబ్లింగ్ & ఇన్‌స్టాలేషన్- ఐటీఐ/డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్/మెకానికల్ లేదా రిలేటెడ్
21. కాయిర్ ప్రొడక్ట్ తయారీ- విద్యార్హత ప్రమాణాలు లేవు
22. ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ స్టూడియో - కనీసం 10వ తరగతి
23. ఆయుర్వేద క్లినిక్ & హెర్బల్ మెడిసిన్ స్టోర్- బీఎఎంఎస్ డిగ్రీ లేదా లైసెన్స్ పొందిన ఆయుర్వేద ప్రాక్టీషనర్
24. జెనరిక్ మెడికల్ షాప్- డి.ఫార్మ్ లేదా బి.ఫార్మ్ (రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్)
25. బ్యూటీ పార్లర్- కనీసం 10వ తరగతి/బ్యూటీషియన్ కోర్సులో సర్టిఫికేషన్లు
26. మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ- మెడికల్ ల్యాబ్ డిప్లొమా లేదా డిగ్రీ (DMLT / BMLT / MLT)
27. ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్- ఐటీఐ/డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్, లేదా సర్టిఫికేషన్ ఈవీ నిర్వహణ, బ్యాటరీ నిర్వహణ లేదా ఎలక్ట్రికల్ సేఫ్టీ
రవాణా రంగం
1. ప్యాసింజర్ ఆటో (3 వీలర్-(e-ఆటో)) -లైట్ మోటార్ వెహికల్ (LMV) డ్రైవింగ్ లైసెన్స్
2. ప్యాసింజర్ ఆటో (4 వీలర్) -కమర్షియల్ లైట్ మోటార్ వెహికల్ (LMV) డ్రైవింగ్ లైసెన్స్
3. ప్యాసింజర్ కార్లు (4 వీలర్) -రవాణా/వాణిజ్య LMV డ్రైవింగ్ లైసెన్స్
వ్యవసాయ రంగం
వ్యవసాయ ప్రయోజనాల కోసం డ్రోన్లు (గ్రూప్ యాక్టివిటీ)- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా డ్రోన్ టెక్నాలజీలో ITI/డిప్లొమా లేదా DGCA-ఆమోదిత సంస్థ నుంచి డ్రోన్ ఆపరేషన్‌లో సంబంధిత స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికెట్
ఎస్సీ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు ఎలా చేయాలి?
- లబ్ధిదారుడు తన ప్రాథమిక వివరాలను https://apobmms.apcfss.in/ వెబ్ సైట్ లో నమోదు చేసుకుని యూజర్ ఐడీ & పాస్‌వర్డ్ పొందాలి.
- యూజర్ ఐడీ - రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మొబైల్ నంబర్
- పాస్‌వర్డ్- రిజిస్ట్రేషన్ కోసం OTP అందించాలి.
- లబ్ధిదారుడు తన దరఖాస్తును పూర్తి చేసేందుకు చిరునామా, కులం, స్వయం ఉపాధి పథకం వివరాలను పూర్తి చేయడానికి ఏపీ ఓబీఎంఎంఎస్ వెబ్ సైట్ ద్వారా లాగిన్ అవ్వాలి.
- దరఖాస్తుదారుడు తన వివరాలు పూరించిన తర్వాత సబ్మిట్ చేసి, అప్లికేషన్ ను ప్రింట్ తీసుకోవాలి.
సంబంధిత కథనం