RGUKT IIIT Faculty Recruitment 2024 : ఏపీలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఏపీ పరిధిలో ఉన్న ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో బోధన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇందులో భాగంగా…. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనుంది. పలు విభాగాల్లో మొత్తం 194 లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఉన్నాయి. జనవరి 22వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి…
రిక్రూట్ మెంట్ ప్రకటన - రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్
ఉద్యోగ ఖాళీలు - మొత్తం 194.
ట్రిపుల్‌ఐటీ క్యాంపస్ లు - నూజివీడు (ఏలూరు జిల్లా), ఆర్కే వ్యాలీ (కడప జిల్లా), ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా), ఒంగోలు (ప్రకాశం జిల్లా).
లెక్చరర్ ఉద్యోగాలు - 61
లెక్చర్ ఖాళీల విభాగాలు/ సబ్జెక్టులు - బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, తెలుగుతో పాటు మరికొన్ని విభాగాల్లో ఖాళీలున్నాయి.
అర్హతలు - కనీసం 50% మార్కులతో సంబంధిత సబ్జెక్టు/ భాషలో ఎంఏ/ ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఈ లెక్చరర్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేస్తారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు -133 పోస్టులు
విభాగాలు/ సబ్జెక్టులు - బయాలజీ, సివిల్ ఇంజినీరింగ్, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ, ఇంగ్లిష్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటిక్స్, మెకానికల్, ఎంఎంఈ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హతలు- సంబంధిత విభాగంలో ఎంఈ/ ఎంటెక్, నెట్/ సెట్ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం - ఆన్‌లైన్ విధానం
ఎంపిక విధానం - ఇంటర్వ్యూ, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా తుది జాబితా ప్రకటిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు తుది గడువు - జనవరి 22, 2024(సాయంత్రం 5 గంటల లోపు)
అధికారిక వెబ్‌సైట్ - https://www.rgukt.in/Institute.php?view=Career
మెయిల్ అడ్రస్ - recruitments@rgukt.in