APPSC Exam Schedule: ఏపీపీఎస్సీ పరీక్ష తేదీలు వెల్లడి
APPSC Exam Schedule: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పలు పరీక్షా తేదీలను కమిషన్ వెల్లడించింది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షా తేదీలను గురువారం విడుదల చేశారు.
APPSC Exam Schedule: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే 11 ఉద్యోగాల రాత పరీక్షల తేదీలను గురువారం ప్రకటించారు. గత ఏడాది చివర్లో నోటిఫికేషన్ ఇచ్చిన పలు ఉద్యోగాల పరీక్షా తేదీలను వెల్లడించారు. ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు రాత పరీక్షలు సెప్టెంబరు 25 నుంచి 27వ తేదీ వరకు జరుగుతాయని ప్రకటించారు.
సివిల్ అసిస్టెంట్ సర్జన్, భూగర్భ నీటిపారుదల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ , అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్, ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, గ్రూపు-4 లిమిటెడ్ రిక్రూట్‌మెంట్, జూనియర్ ట్రాన్సలేటర్ తెలుగు, టెక్నికల్ అసిస్టెంట్ మైన్స్, డిస్ట్రిక్ట్ ప్రొబెషన్ ఆఫీసర్ గ్రేడ్-2 (జువైనల్ వెల్ఫేర్) ఉద్యోగాలకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్ష అక్టోబరు 3న జరగనుంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సబ్జెక్టు రాత పరీక్షలు వేర్వేరు తేదీల్లో ఆన్‌లైన్‌లో జరుగుతాయి.
కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు…
ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 22 వరకు కంప్యూటర్ బేస్ రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ అండ్ ఫుడ్ విభాగంలో శాంపిల్ టేకర్, టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్ సీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షలకు మొత్తం 3,535 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు వివరించారు.