ఏపీ పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల, ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి-ap polycet 2025 hall ticket released download from polycetap with simple steps ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీ పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల, ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి

ఏపీ పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల, ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి

ఏపీ పాలిసెట్-2025 హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ https://polycetap.nic.in/ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 30న పరీక్ష నిర్వహిస్తారు.

ఏపీ పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల, ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ)-2025 పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్) హాల్ టికెట్లను విడుదల చేసింది. ఏపీ పాలిసెట్-2025 పరీక్షకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఏపీ పాలిసెట్ అధికారిక వెబ్సైట్ polycetap.nic.in నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ, పరీక్ష సమయాలు, పరీక్షకు హాజరయ్యే సమయంలో అభ్యర్థి పాటించాల్సిన ముఖ్యమైన సూచనలను హాల్ టికెట్ లో పొందుపరుస్తారు.

ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ డౌన్ లోడ్ ఎలా?

  • ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ డౌన్ లోడ్ కోసం polycetap.nic.in అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
  • హోమ్ పేజీలో ప్రింట్ హాల్ టికెట్ పై క్లిక్ చేయండి.
  • టెన్త్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్/మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి టెన్త్ హాల్ టికెట్ నెంబర్ లేదా ఫోన్ నెంబర్, టెన్త్ పాస్ అయిన సంవత్సరం, క్యాప్చా ఎంటర్ చేయాలి.
  • వ్యూ & ప్రింట్ హాల్ టికెట్ పై క్లిక్ చేయండి.
  • స్క్రీన్ పై హాల్ టికెట్ కనిపిస్తుంది. హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

ఏప్రిల్ 30న పాలిసెట్

హాల్ టికెట్ పై అభ్యర్థులు వివరాలను సరిచూసుకోండి. హాల్ టికెట్ పై ఏవైనా తప్పులుంటే వెంటనే పరీక్ష నిర్వహణ అధికారిని సంప్రదించాలి. అభ్యర్థులు హాల్ టికెట్ లో ఇచ్చిన సూచనలను పాటించాలి. పరీక్ష రోజు హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి.

ఏపీ పాలిసెట్-2025 ఏప్రిల్ 30 బుధవారం ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఏపీలోన 26 జిల్లాల్లోని 69 పట్టణాల్లో దాదాపు 500 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

పాలిసెట్ పరీక్ష విధానం

ఏపీ పాలిసెట్ 2025ను ఆఫ్ లైన్ లో నిర్వహిస్తారు. ఇందులో 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 50, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇస్తారు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవు. పేపర్ 2 గంటల (120 నిమిషాలు) ఉంటుంది.

పాలిసెట్ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 12న ప్రారంభమై ఏప్రిల్ 17న ముగిసింది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం