Nara Lokesh : ఏపీ రాజకీయాల్లో కీలకంగా 'డిప్యూటీ సీఎం' హోదా- లోకేశ్ ను రంగంలోకి దించాలంటున్న టీడీపీ శ్రేణులు!-ap politics tdp cadre demands deputy cm post to nara lokesh to break pawan kalyan speed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nara Lokesh : ఏపీ రాజకీయాల్లో కీలకంగా 'డిప్యూటీ సీఎం' హోదా- లోకేశ్ ను రంగంలోకి దించాలంటున్న టీడీపీ శ్రేణులు!

Nara Lokesh : ఏపీ రాజకీయాల్లో కీలకంగా 'డిప్యూటీ సీఎం' హోదా- లోకేశ్ ను రంగంలోకి దించాలంటున్న టీడీపీ శ్రేణులు!

Bandaru Satyaprasad HT Telugu
Jan 16, 2025 02:07 PM IST

Nara Lokesh : ఏపీ రాజకీయాల్లో ఓ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అదేంటంటే...మంత్రి లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదా. టీడీపీలో నెంబర్ 2 గా ఉన్న లోకేశ్ ను ప్రభుత్వంలో కూడా అదేస్థాయిలో చూడాలని టీడీపీ వర్గాలు కోరుకుంటున్నాయి. మారుతున్న పరిస్థితులపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో? కీలకంగా మారింది.

ఏపీ రాజకీయాల్లో కీలకంగా 'డిప్యూటీ సీఎం' హోదా- లోకేశ్ ను రంగంలోకి దించాలంటున్న టీడీపీ శ్రేణులు!
ఏపీ రాజకీయాల్లో కీలకంగా 'డిప్యూటీ సీఎం' హోదా- లోకేశ్ ను రంగంలోకి దించాలంటున్న టీడీపీ శ్రేణులు!

Nara Lokesh : ఏపీలో త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల నుంచి కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. అదే.. మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదా. టీడీపీలో నెంబర్ 2 గా ఉన్న లోకేశ్ ను ప్రభుత్వంలో కూడా అదే స్థాయిలో చూడాలని ఆ పార్టీ శ్రేణులు భావిస్తు్న్నాయి. ఇటీవల టీడీపీ ప్రధాన కార్యదర్శి రాజేష్ మహాసేన కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.

డిప్యూటీ సీఎం టు సీఎం

కూటమి అధికారంలోకి రావడానికి లోకేశ్ పాత్ర కీలకమని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. యువగళం పాదయాత్రతో ప్రజల్లో ఉంటూ టీడీపీని పటిష్ట పరిచారని అంటున్నాయి. చంద్రబాబు తర్వాత సీఎం పదవి లోకేశ్ కే దక్కాలని, ఆ దిశగా అడుగులు వేసేందుకు ఈ నాలుగన్నరేళ్లు కీలకమని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే వీలైనంత తొందరగా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేస్తే...అనంతరం సీఎం అయ్యేందుకు రోడ్ మ్యాప్ క్లియర్ అవుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

కూటమి పార్టీలు జట్టుకట్టడానికి కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్...డిప్యూటీ సీఎం ఒక్కరే ఉండాలని షరతు విధించినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు సైతం పొత్తు ధర్మంలో భాగంగా డిప్యూటీ సీఎంగా పవన్ ఒక్కరినే నియమించారు. ఇటు పార్టీలో, అటు ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తున్న లోకేశ్ ను..డిప్యూటీ సీఎం హోదాలో చూడాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. కాకినాడ పోర్టు, తిరుపతి తొక్కిసలాట, నియోజకవర్గాల్లో పర్యటనలు, పాలనలో పవన్ కల్యాణ్ తన మార్క్ చూపిస్తుండడంతో...రానున్న కాలంలో పరిస్థితులు ఎలా మారతాయో అని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

ఫ్రంట్ రన్ లోకి లోకేశ్!

కూటమిలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో లోకేశ్ కు ఫ్రంట్ రన్ లోకి తీసుకురావాలని, చంద్రబాబు...తర్వాత లోకేశ్ అనేలా అటు పార్టీలో, పాలనలో లోకేశ్ మార్క్ కనిపించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో....ప్రధానితో పాటు వేదిక మీద మంత్రి లోకేశ్‌కు స్థానం కల్పించడం... ఈ ఎత్తుగడల్లో భాగమేనని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ తన మార్క్ చూపిస్తుండడంతో...పవన్ కు చెక్ పెట్టేందుకు లోకేశ్ రంగంలోకి దింపాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయని సమాచారం. టీడీపీ భవిష్యత్తు కోసం లోకేశ్ ను ముందుకు తీసుకురావడం తప్పనిసరి ఆ పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారట.

కీలకంగా పవన్

టీడీపీ అధికార ప్రతినిధి హోదాలో రాజేశ్ మహాసేన చేసిన వ్యాఖ్యలను జనసేన సైతం నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులకు పవన్ కల్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో? లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప్రతిపాదన వస్తే అందుకు పవన్ ఓకే చెబుతారా? నాగబాబుకు మంత్రి, లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదా ముడిపడి ఉన్నాయా? అనే చర్చ జరుగుతున్నాయి. ఏదేమైనా మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని పవన్ కల్యాణ్ అంటున్నారు. కూటమిని అధికారంలో తీసుకొచ్చేందుకు కాస్త తగ్గిన పవన్ కల్యాణ్....మరోసారి తగ్గి కూటమిలో చీలికలు రాకుండా చూస్తారా? లేదా ప్రతిపక్షం విమర్శలకు ఛాన్స్ ఇస్తారా? అనేది కీలకంగా మారింది.

Whats_app_banner

సంబంధిత కథనం