AP Political Slogans : ఒక్క మాట.. ఒకే ఒక్క మాట.. ఎప్పుడూ ఇదే ట్రెండ్
Andhra Pradesh Politics : ఒక్కమాట చాలు ప్రజల్లోకి వెళ్లేందుకు, ఒక్క నినాదం చాలు అనేక మందిని ఏకం చేసేందుకు.. ఇప్పుడే కాదు.. చాలా ఏళ్ల నుంచి కొనసాగుతోంది ఈ ట్రెండ్. పార్టీలు స్లోగన్ పట్టుకుని జనాల్లోకి వెళ్తే.. చాలు. గెలుపు తర్వాత విషయం.. కానీ ప్రజల నాలుకల మీద మాత్రం ఎప్పుడూ నానుతూనే ఉంటాయి స్లోగన్స్.
అప్పుడెప్పుడో తెలుగు వారి ఆత్మగౌరవం అనే ఒక్క మాటతో తెలుగుజాతిని ఏకం చేశారు ఎన్టీఆర్(NTR). ఇప్పటికీ రాజకీయ నాయకులు నుంచి అవే నినాదాలు. 'రావాలి జగన్.. కావాలి జగన్'.. 'జాబు కావాలంటే.. బాబు రావాలి.' ఇలా ఒక్క స్లోగన్ తో జనాల్లోకి వెళ్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) దగ్గరకొస్తున్నాయి. మరి కొత్త స్లోగన్స్ కావాలి కదా.. 2024 కోసం ఇప్పటికే స్లోగన్స్ రెడీ అయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. రాజకీయ పార్టీలు హాస్యభరితమైన.. ఆకర్షణీయమైన పదాలను చెబుతున్నాయి. వన్ లైన్ నినాదాలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ట్రెండింగ్(Trending) అవుతున్న పదాలు చూసుకుంటే ఆసక్తిగా ఉన్నాయి. ఏ పార్టీ ఎందులోనూ తగ్గట్లేదు. 'గడప గడపకు మన ప్రభుత్వం', 'వై నాట్ 175/175', 'ఫస్ట్ టార్గెట్ కుప్పం' వంటి కొత్త నినాదాలతో అధికార వైఎస్ఆర్ పార్టీ జనాల్లోకి వెళ్తోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ(TDP) సరికొత్త స్లోగన్స్ తో ముందుకువస్తోంది.
'ఇప్పుడు కాకపోతే ఇంకెపుడు', 'బాదుడే బడుడు' లాంటి టైటిల్స్‌తో ఆందోళన కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవుతోంది. తాజాగా 'ఇదేమి కర్మ' అనే మరో నినాదంతో వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే.. వీటికోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా(Social Media) వింగ్స్ కూడా ఏర్పాటు అయ్యాయి. వాళ్లు ఈ స్లోగన్స్ తో ప్రత్యర్థి పార్టీకి సంబంధించి.. పోస్టులు పెడుతూ ఉంటారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు.. 'చివరి యుద్ధం' చేస్తున్నామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) చెబుతున్నారు. మూడున్నరేళ్లలో ఏపీని వివిధ రంగాల్లో విధ్వంసం చేశారని ఆరోపిస్తోంది టీడీపీ.
మరోవైపు 2024 అసెంబ్లీ ఎన్నికల(2024 Elections) ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్(Paswan Kalyan) కూడా ముందుకు వచ్చారు. ఇటీవలి పర్యటనల్లో రాష్ట్రాన్ని నడిపించడానికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అడుగుతున్నారు. 'ఒక్క అవకాశం' అనే నినాదంతో వెళ్తున్నారు. జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్ కూడా 'ఒక్క ఛాన్స్' నినాదంతో ప్రచారం చేస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu).. ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్పులపై విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే మరోవైపు బ్యాలెన్సింగ్ పాలిటిక్స్(Politics) చేస్తూ.. సంక్షేమ మంత్రాన్ని కూడా జపిస్తున్నారు. మరోవైపు జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్ గతంలో సంక్షేమ పథకాలు ప్రజలను సోమరులను చేస్తున్నాయని విమర్శించారు. కానీ ఇప్పుడు స్వరం మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. సంక్షేమ(Welfare) పాలనతోపాటుగా.. అవినీతి రహిత పాలన అందిస్తామని చెబుతున్నారు. ఇలా ఏపీ రాజకీయాలు, 'ఒక్కఛాన్స్', 'లాస్ట్ ఛాన్స్', 'సంక్షేమం' అనే పదాల చుట్టూ తిరుగుతున్నాయి.
ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఇంకా ఈ వన్ లైన్ స్లోగన్స్(Online Slogans) ఎక్కువగా రానున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలు తమదైన ప్రచారంతో జనాల్లోకి వెళ్లనున్నాయి. కొత్త కొత్త స్లోగన్స్ తో ఏపీ రాజకీయం(AP Politics) మారుతోంది. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు ముందుకు వెళ్తున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్