AP Police Job Syllabus : ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఏం చదవాలి?-ap police recruitment here s si and constable syllabus details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Police Recruitment Here's Si And Constable Syllabus Details

AP Police Job Syllabus : ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఏం చదవాలి?

HT Telugu Desk HT Telugu
Dec 01, 2022 04:43 PM IST

Andhra Pradesh Police Recruitment : ఇటీవలే ఏపీ ప్రభుత్వం 6511 పోలీస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే పరీక్ష కోసం ఇప్పటినుంచే ప్రణాళికతో చదివితేనే ఉద్యోగం సొంతమవుతుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

411 ఎస్సై పోస్టులకు, 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏపీలో నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే అభ్యర్థులు ప్రిపరేషన్ పై పడ్డారు. సరిగా ప్లాన్ చేసుకుని చదివితే ఉద్యోగం సాధిస్తారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 28లోపు కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 14 నుంచి జనవరి 18 వరకు ఎస్సై పోస్టులకు అప్లై చేసుకోవాలి. ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, చివరి రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి స్థాయి పరీక్షకు అర్హులుగా ఉంటారు.

ట్రెండింగ్ వార్తలు

ప్రిలిమినరీ పరీక్ష అనేది బహుళ ప్రశ్నలతో కూడిన రాత పరీక్ష, అయితే ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఒక అభ్యర్థి భౌతిక సామర్థ్యాన్ని పరిశీలిస్తాయి. ముందుగా ప్రిలిమినరీ పరీక్షలో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కు ఒక పేపర్ ఉంటుంది. ఛాయిస్ ప్రశ్నలు.. మెుత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్థమేటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, మెుదలైనవి ఉంటాయి. అంతేకాకుండా భారతీయ సంస్కృతి, భారతదేశ చరిత్ర, భౌగోళిక శాస్త్రం, భారత రాజ్యంగంలోని ముఖ్యమైన విషయాలు, స్వాతంత్ర్య పోరాటం, ఆర్థిక శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలు, పర్యావరణ పరీరక్షణ, సైన్స్, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

ప్రిలిమ్స్ కోసం చదివింది మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది. అయితే కొంచెం లోతుగా చదివితే మంచిది. మెయిన్స్ క్వశ్చన్ పేపర్ కాస్త టఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో కూడా 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటలు ఉంటుంది. అర్థమేటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు వస్తాయి.

ఇక ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష కూడా 200 మార్కులకు జరుగుతుంది. దీనికోసం పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. 100 మార్కులు పేపర్ 1, 100 మార్కులు పేపర్ 2కు ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటలు ఉంటుంది. పేపర్ 1 లో జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ నుంచి మెుదలైన ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 2లో భారతీయ సంస్కృతి, సైన్స్, భౌగోళిక శాస్త్రం, భారత రాజ్యాంగం, ముఖ్యమైన సంఘటనలు, భారత స్వాతంత్య్ర పోరాటం, ఆర్థిక శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థిక పరిణామాలు, పర్యావరణం గురించి మెుదలైన సిలబస్ ఉంటుంది.

సివిల్ ఎస్సై మెయిన్స్ కోసం.. పేపర్ 1, 2 డిస్క్రిప్టివ్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ కోసం.. ఇంగ్లీష్ నుంచి కాంప్రహెన్షన్, లెటర్ రైటింగ్, పేరాగ్రాఫ్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్ లేషన్, మెుదలైన వాటి మీద ప్రశ్నలు ఉంటాయి. తెలుగు పేపర్ లో కాంప్రహెన్షన్, ప్రెసిస్, లెటర్ రైటింగ్, పేరాగ్రాఫ్ రైటింగ్, రిపోర్టింగ్ రైటింగ్, తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్ లేషన్ వంటి వాటిపై ప్రశ్నలు వేస్తారు. పేపర్ 3లో 200 ప్రశ్నలకు.. అర్థమేటిక్ అండ్ రీజనింగ్ 200 మార్కులకు ఉంటుంది. పేపర్ 4 లో 200 ప్రశ్నలకు జనరల్ స్టడీస్ 200 మార్కులకు ఉంటుంది.

ఇక రిజర్వ్ సబ్ ఇన్సెపెక్టర్ పేపర్ 1, 2 క్వాలిఫైయింగ్ చూస్తారు. పేపర్ 3లో 100 మార్కులు, పేపర్ 4లో 100 మార్కులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ 100 మార్కులకు మెుత్తం 300 మార్కులకు తుది ఎంపి కోసం పరిగణిస్తారు.

IPL_Entry_Point