AP Police Jobs Notification: ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల-ap police recruitment 411 sub inspectors and 6100 police constable jobs notification released in andhra pradesh here s complete details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Police Recruitment 411 Sub Inspectors And 6100 Police Constable Jobs Notification Released In Andhra Pradesh Here's Complete Details

AP Police Jobs Notification: ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

HT Telugu Desk HT Telugu
Nov 28, 2022 04:10 PM IST

AP Police Jobs Recruitment 2022: నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 6511 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఏపీ పోలీస్ జాబ్స్
ఏపీ పోలీస్ జాబ్స్

AP police notification 2022 telugu: పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 6511 ఉద్యోగాలకు నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఏటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం జగన్(CM Jagan) ఇటీవలే ఆదేశించారు. ఈ ఏడాది 6511 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 411 ఎస్పై ఉద్యోగాలు కాగా, 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ap police notification 2022 telugu: పోస్టుల బ్రేకప్

ఎస్సై పోస్టులు(SI Posts) మహిళలు, పురుషులకు(సివిల్) 315 ఉద్యోగాలు ఉండగా.. రిజర్వ్ సబ్ ఇన్సెపెక్టర్ ఆఫ్ పోలీస్ పురుషులకు (APSP) 96 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్(Civil) పురుషులు, మహిళలకు 3580 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్(ఏపీఎస్పీ) 2520 ఉద్యోగాలు ఉన్నాయి. 2023 ఫిబ్రవరి 19న ఎస్సై పోస్టులకు ఎగ్జామ్(SI Exam) ఉంటుంది. జనవరి 22న పోలీస్ కానిస్టేబుల్(Police Constable) పోస్టులకు పరీక్ష నిర్వహిస్తారు.

ap police notification 2022 telugu: హాల్‌టికెట్ల జారీ

ఎస్‌ఐ పోస్టులకు సంబంధించి.. ఫిబ్రవరి 5 నుంచి హాల్‌టికెట్లు(Hall Tickets) జారీ అవుతాయి. కానిస్టేబుల్‌ పోస్టులకు జనవరి 9 నుంచి హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. ఎస్​ఐ పోస్టులకు ఫ్రిబవరి 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్‌-1 పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ 2 ఎస్‌ఐ పరీక్ష ఉంటుంది.

ap police notification 2022 telugu: ఆన్‌‌లైన్ అప్లికేషన్ల స్వీకరణ

ఎస్సై పోస్టులకు ఆన్ లైన్ అప్లికేషన్స్(Online Application) 14.12.2022 నుంచి స్వీకరిస్తారు. 18 జనవరి 2023 చివరి తేదీగా నిర్ణయించారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 30.11.2022 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. 28.12.2022 చివరి తేదీగా ఉంది.

ap police notification 2022 telugu: విద్యార్హతలు ఇవే

ఎస్‌ఐ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ పాస్ అయి ఉండాలి. కానిస్టేబుల్‌ పోస్టులకు(Constable Posts) ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులవ్వాలి. మరోవైపు ఇటీవల పోలీస్ ఉద్యోగాల నియమకాల్లో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. హోంగార్డులకు 15 శాతం రిజర్వేషన్ ఉండనున్నట్టుగా ప్రకటించింది. హోంగార్డులకు రిజర్వేషన్లు వర్తింప చేయడానికి 'ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ రూల్స్‌ 1999'కి సవరణ చేస్తూ ఏపీ హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలో 15 వేల మంది హోంగార్డులకు ప్రయోజనం కలగనుంది.

ap police notification 2022:

ap police notification 2022 telugu

IPL_Entry_Point