ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రమే ఆప్కాబ్ ఛైర్మన్ సహా పలు డీసీసీబీ ఛైర్మన్‌లను నియమించారు. తాజాగా ప్రభుత్వం మరికొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా రాయపాటి శైలజ, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా ఆలపాటి సురేశ్ ను నియమించింది.
మొత్తం 22 మందిని వివిధ సంస్థలకు ఛైర్మన్లుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం పలు విడతలుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే.
సంబంధిత కథనం