AP Model Schools : ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే-ap model schools admissions 2024 notification released check the key dates are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Model Schools : ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే

AP Model Schools : ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 02, 2024 06:38 AM IST

AP Model Schools Admissions 2024:ఏపీ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలు 2024
ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలు 2024

AP Model Schools Admissions 2024: ఆంధ్రప్రదేశ్ లోని ఆదర్శ పాఠశాలల్లో (AP Mode Schools) ఆరో తరగతిలోప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. మార్చి 1వ తేదీన ప్రకటన విడుదలకాగా… మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.  ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష జరగనుంది. https://apms.apcfss.in/ వెబ్ సైట్ లో వివరాలను చూడవచ్చు.

ముఖ్య వివరాలు:

ప్రవేశాలు - ఏపీ మోడల్ స్కూల్స్

ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.

ప్రస్తుతం  5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత కలిగి ఉండాలి.

ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2012 -31.08.2014 మధ్య జన్మించి ఉండాలి. 

ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2010 -31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి.

రుసుం - ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 75 కట్టాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం - మార్చి 01,2024.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31. మార్చి.2024.

పరీక్ష తేదీ -21. ఏప్రిల్ .2024 (ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు  ఉండే స్థానిక మండల కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.)

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రవేశాలకు ఆహ్వానం..

Hyderabad Public School Admissions : బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(Hyderabad Public School ) లో అర్హులైన షెడ్యూల్ కులాల విద్యార్థులకు 1వ తరగతి ఇంగ్లీష్ మీడియం ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు ఈ మేరకు ప్రకటనలు జారీ చేశారు. వచ్చే విద్యాసంవత్సరం(2024-25) ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించరాదు. అప్లికేషన్ ఫామ్ లను ఫిబ్రవరి 25- మార్చి 12వ తేదీ వరకు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి కార్యాలయాల్లో పొందవచ్చని అధికారులు తెలిపారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి ప్రవేశం కోసం జోగులాంబ గద్వాల జిల్లాకు ఒక సీటు కేటాయించినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. విద్యార్థి పేరు మీద కుల ధ్రువీకరణ పత్రం ఉండాలని తెలిపారు. అర్హులైన వాళ్లు దరఖాస్తు ఫామ్ లను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో, గద్వాలలోని ఐ.డి.ఓ.సి కాంప్లెక్స్ రూమ్ నెంబర్ ఎఫ్-8 పొందవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 12 చివరి తేదీ అన్నారు. ఇతర సమాచారం కోసం 8309540738 నెంబర్ ను సంప్రదించవచ్చని సూచించారు. లక్కీ డిప్ ద్వారా మార్చి 15న విద్యార్థిని ఎంపిక చేస్తామన్నారు.