Roja Comments : నాలుక కోస్తానంటూ రోజా వార్నింగ్….-ap minister roja strong comments against tdp leaders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Minister Roja Strong Comments Against Tdp Leaders

Roja Comments : నాలుక కోస్తానంటూ రోజా వార్నింగ్….

HT Telugu Desk HT Telugu
Oct 02, 2022 08:16 AM IST

Roja Comments సీఎం జగన్, ఆయన కుటుంబసభ్యుల జోలికి వస్తే నాలుక కోస్తానంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్న రోజా, చంద్రబాబు, లోకేశ్ ఆయన గుర్తింపు కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు ఒక జిల్లాకి వైసీపీ పెట్టిందన్నారు. నాడు నరకాసురుడిపై మహిశాసురమర్దిని విజయానికి ప్రతీకగా దసరా ఉత్సవాలు జరుపుకుంటుంటే, నేడు నారాసురుడిని జగన్ జయించడంతో మహిళా సాధికారత ఉత్సవాలు చేస్తున్నామని మంత్రి రోజా చెప్పారు.

ఏపీ మంత్రి ఆర్కే రోజా
ఏపీ మంత్రి ఆర్కే రోజా

Roja Comments సీఎం జగన్‌ను గానీ, ఆయన కుటుంబ సభ్యులను గానీ విమర్శించే వారి నాలుక కోసి ఉప్పూ కారం పెడతానని ఘాటుగా కామెంట్ చేశారు మంత్రి రోజా…. ఎన్టీఆర్‌పై మాట్లాడే అర్హత టీడీపీకి లేదని, రాష్ట్రంలో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన ఘనత వైసీపీదేనన్నారు. అయ్యన్నపాత్రుడు లాంటి నేతలు సైకోల మాదిరిగా వ్యవహరిస్తున్నారని, అలాంటి నేతలను త్వరలో పిచ్చాసుపత్రిలో చేర్చకపోతే ప్రజలే రాళ్లతో కొట్టి చంపేస్తారన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు

అయ్యన్న వ్యాఖ్యలు చూస్తే… ఆయన వయసుకు, ఆయన చేపట్టిన పదవులకు గౌరవం ఇవ్వలేకపోతున్నామన్నారు. రాజకీయంగా సమస్యలు దొరకలేదని జగన్ కుటుంబంపై విమర్శలు చేస్తే ఇకపై సహించబోమని” హెచ్చరించారు మంత్రి రోజా.

టీడీపీ సీనియ‌ర్ నేత అయ్య‌న్న‌పాత్రుడు సైకో మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా విమ‌ర్శించారు. అలాంటి నేత‌ల‌ను త్వ‌ర‌లో పిచ్చాసుప‌త్రిలో చేర్చ‌క‌పోతే ప్ర‌జ‌లే రాళ్ల‌తో కొట్టి చంపేస్తార‌న్న విష‌యాన్ని టీడీపీ నేత‌లు గుర్తించాల‌న్నారు. ‍యూనివర్శిటీ పేరు మార్పు విషయంలో టీడీపీది అనవసరమైన రాద్దాంతం అని, వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కానీ, లోకేశ్ కానీ, బాలకృష్ణ కానీ ఎన్టీఆర్ కు పేరు తెచ్చే విధంగా ఒక బిల్డిండ్ అయినా కట్టారా? ఒక అభివృద్ధి కార్యక్రమం అయినా చేశారా అని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ పేరుతో ఒక మంచి వెల్ఫేర్ స్కీమ్ అయినా వారి బుర్రల్లో వచ్చిందా అని నిలీశారు. వాళ్లకి ఎన్టీఆర్ మీద అభిమానం లేదని, కేవలం ప్రతిదాన్ని రాజకీయం చేసి రాజకీయ లబ్ది పొందాలని అనుకుంటున్నారు తప్ప మరొకటి కాదనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. టీడీపీ నేతల తీరును మీడియా కూడా అర్థం చేసుకోవాలని మంత్రి రోజా అన్నారు.

IPL_Entry_Point

టాపిక్