AP Mega DSC Update: ఏపీ మెగా డిఎస్సీ అప్డేట్.. ఎన్నికల కోడ్‌ ముగియగానే నోటిఫికేషన్? షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు..-ap mega dsc update notification once the election code expires exams as per schedule ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Mega Dsc Update: ఏపీ మెగా డిఎస్సీ అప్డేట్.. ఎన్నికల కోడ్‌ ముగియగానే నోటిఫికేషన్? షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు..

AP Mega DSC Update: ఏపీ మెగా డిఎస్సీ అప్డేట్.. ఎన్నికల కోడ్‌ ముగియగానే నోటిఫికేషన్? షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు..

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 30, 2025 11:00 AM IST

AP Mega DSC Update: ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడటంతో తీవ్రమైన జాప్యం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యేలోపు నియామకాలు చేపట్టేలా ఎన్నికల కోడ్ ముగియగానే నోటఫికేషన్‌ జారీ చేస్తారు.

మార్చిలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్
మార్చిలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్

AP Mega DSC Update: ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు… డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంతో తెలియక చేస్తున్న ఉద్యోగాలు మానేసి గత ఏడాది జులై నుంచి పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్థులకు టీడీపీ సర్కార్‌ అలెర్ట్ చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యేలోపు పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తున్నారు.

yearly horoscope entry point

ఏపీలో బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల ప్రక్రియ మార్చి మొదటి వారంలోపు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మార్చి రెండో వారంలో డిఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలలో కొంత జాప్యం జరిగినా ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే నోటిఫికేషన్ వెలువడుతుందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మార్చ్ 15 తరువాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

మే మొదటి వారంలో డిఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్, జూలై నెలలలో పోస్టింగ్స్ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. గత ఏడాది జూన్‌12న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 16వేల పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌పై సంతకం చేశారు.

గత నవంబర్‌లో నోటిఫికేషన్‌ వెలువరించే సమయంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వివాదం తెరపైకి వచ్చింది. మందకృష్ణ మాదిగ అభ్యంతరాల నేపథ్యంలో నోటిఫికేషన్ వాయిదా పడింది. ఆ తర్వాత వర్గీకరణపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కమిషన్‌ పదవీ కాలాన్ని పొడిగించినా ఫిబ్రవరిలోనే కమిషన్‌ నివేదిక ప్రభుత్వానికి చేరే అవకాశం ఉంది. జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్లను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల్లో సామాజిక వర్గాల వారీగా ఉద్యోగుల జాబితాను ప్రభుత్వం కమిషన్‌కు అందించింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జనాభాను కూడా గుర్తిస్తున్నారు. ప్రతి ఇంటిని మ్యాపింగ్ చేసి కులాల వారీగా జనాభాను ధృవీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్సీ జనాభాపై జిల్లాల వారీగా రిజర్వేషన్ల అమలును కొలిక్కి తెచ్చి నోటిఫికేషన్‌ వెలువరించే అవకాశాలు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం