AP JAC Amaravati : ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై దుమారం….-ap jac amaravati and outsourcing employees association opposes government decision ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Jac Amaravati And Outsourcing Employees Association Opposes Government Decision

AP JAC Amaravati : ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై దుమారం….

HT Telugu Desk HT Telugu
Dec 05, 2022 12:06 PM IST

AP JAC Amaravati పదేళ్లలోపు సర్వీస్‌ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన మెమో ఒక్క శాఖకు సంబంధించిన నిర్ణయమేనని వివరణ ఇస్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న వారిలో ఆందోళన నెలకొనడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీజేఏసీ అమరావతి డిమాండ్ చేసింది.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తొలగించాలనే నిర్ణయంపై ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతోంది.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తొలగించాలనే నిర్ణయంపై ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతోంది.

AP JAC Amaravati ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందనే వార్తలు ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపాయి. ప్రభుత్వం జారీ చేసిన రహస్య ఉత్తర్వులు వెలుగు చూడటంతో ఉద్యోగ వర్గాల్లో కలకలం రేగింది. రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది పోరుగుసేవ ఉద్యోగులు ఆందోళన చెందుతూ అర్ధాంతరంగా మమ్ములను తొలగిస్తే, రోడ్డున పడతామంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నాయకులపై ఒత్తిడి పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ ఉన్నతాధికారులను ఉద్యోగ సంఘాల నాయకులు వివరణ కోరారు. ప్రభుత్వం జారీ చేసి మెమో కేవలం డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ & అకౌంట్స్ శాఖలో పదేళ్ల లోపు పనిచేసే పోరుగుసేవల ఉద్యోగులకు మాత్రమేనని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వాళ్ళకి ఇచ్చామని, మిగిలిన ఏ శాఖలో పనిచేసే పొరుగుసేవల ఉద్యోగులకు ప్రభుత్వ ఉత్తర్వులతో సంబంధం లేదని స్పష్టత నిచ్చారు.

ప్రస్తుతం వర్క్స్ & అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న వారికి ఇచ్చిన మెమోకు , మిగిలిన శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వానికి పోరుగుసెవల ఉద్యోగులను ఎవరినీ తొలగించే ఆలోచన లేదని ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

ప్రభుత్వంలో అనేక శాఖలలో పనిచేసే పొరుగుసేవల ఉద్యోగులు తాజా మెమో గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ & అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పది సంవత్సరాల లోపు పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలనుకోవడం కూడా అన్యాయమని ఉద్యోగులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ లో పదేళ్ల లోపు పనిచేసే పొరుగుసేవ ల ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులను విదులనుండి తొలగించాలని డిసెంబర్‌ 1న ఇచ్చిన మెమోను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయాి. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ & అకౌంట్స్ లో ఏదైనా ప్రత్యేక కారణాలు ఉంటే, అందులో పనిచేసి ఉద్యోగులను మరొక శాఖలో సర్దుబాటు చేయాలి తప్ప ఇలా తొలగించాలని మెమో ఇవ్వడం భావ్యం కాదన్నారు.

IPL_Entry_Point

టాపిక్