AP Inter Supplementary Time Table : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. మే 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏపీ ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మే 12 నుంచి మే 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపంది. మే 28 నుంచి జూన్ 1 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 4న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష , జూన్ 6న పర్యావరణ విద్య నిర్వహించనున్నారు.
ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను https://resultsbie.ap.gov.in లో ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు. అలాగే 9552300009 కు మన మిత్ర వాట్సాప్ నంబర్‌కు "హాయ్" మెసేజ్ పంపడం ద్వారా ఫలితాలను యాక్సెస్ చేయవచ్చు.
ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాలు గత దశాబ్దంలో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశాయి. మొదటి సంవత్సరం 70%, రెండో సంవత్సరం విద్యార్థులకు 83% ఉత్తీర్ణత సాధించారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రభుత్వ నిర్వహణలోని సంస్థలలో మెరుగైన ఉత్తీర్ణత నమోదు చేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో రెండో ఏడాది ఉత్తీర్ణత శాతం 10 సంవత్సరాల గరిష్ట స్థాయి 69%కి చేరుకుంది. మొదటి సంవత్సరం విద్యార్థులకు, ఉత్తీర్ణత శాతం 47% వద్ద ఉంది. ఇది గత దశాబ్దంలో రెండో అత్యధికం.
సంబంధిత కథనం