ఏపీలో రూ. 33వేల కోట్లతో 19 ప్రాజెక్టులకు ఇండస్ట్రియల్ ప్రమోషన్‌ బోర్డు ఆమోదం-ap industrial promotion board approves 19 projects worth 33 thousand crore expected to generate 4 lakh jobs ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీలో రూ. 33వేల కోట్లతో 19 ప్రాజెక్టులకు ఇండస్ట్రియల్ ప్రమోషన్‌ బోర్డు ఆమోదం

ఏపీలో రూ. 33వేల కోట్లతో 19 ప్రాజెక్టులకు ఇండస్ట్రియల్ ప్రమోషన్‌ బోర్డు ఆమోదం

Sarath Chandra.B HT Telugu

ఆంధ్రప్రదేశ్‌లో రూ.33వేల కోట్ల పెట్టుబడులతో 19 భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది. ఎనర్జీ, టూరిజం,ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో 35వేల ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

రూ.33వేల కోట్లతో 19 పరిశ్రమలకు SIPB ఆమోదం

ఏపీలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థల ఆసక్తి చూపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని వెను వెంటనే ప్రాజెక్టుల స్థాపనకు శ్రీకారం చుడుతున్నాయి.

ఏపీలో పరిశ్రమల ఏర్పాటులో భాగంగా కొన్ని సంస్థలు శంకుస్థాపనలు చేయగా మరి కొన్ని కంపెనీలు పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకుంటున్నాయి. 11 నెలల కాలంలో ఎస్ఐపీబీ ఇప్పటికి 6 సార్లు సమావేశం కాగా, 76 ప్రాజెక్టులకు సంబంధించి రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.

ఈ పెట్టుబడుల ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాన్నాయి. గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 6వ ఎస్ఐపిబి సమావేశంలో 19 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. రూ. 33 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఎనర్టీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ప్రాజెక్టుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ

రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముందుకు వచ్చి ఒప్పందాలు చేసుకున్న సంస్థలు... ప్రాజెక్టుల శంకుస్ధాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిని నిరంతరం ఫాలోఅప్ చేయాలని ఆయా సంస్ధల పెట్టుబడులు, క్షేత్ర స్థాయి పనుల స్థితిగతులను తెలుసుకునేందుకు డాష్ బోర్డ్ తీసుకురావాలన్నారు.

ఏ ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉంది అనేది తెలుసుకోవచ్చని పెట్టుబడులతో పాటు వచ్చిన ఉద్యోగాల వివరాలతో పోర్టల్ రావాలని ఎస్ఐపిబి సమావేశాల్లో కొత్త పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు... ఇప్పటికే ఆమోదం తెలిపి ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రోగ్రస్ వివరించాలి’ అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

50 వేల హోటల్ రూములు లక్ష్యం

టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుపై సిఎం చంద్రబాబు మాట్లాడుతూ...‘టూరిజం సెక్టార్‌లో హోటళ్లు, రూముల కొరత ఉంది. పెద్దఎత్తున హొటల్ రూమ్‌లు వస్తే పర్యాటకానికి ఊపు వస్తుంది. 50 వేల రూమ్‌లు అందుబాటులోకి తేవాలి అనేది మన ముందున్న లక్ష్యమన్నారు. హోటల్ రూమ్‌ల ధరలు అందుబాటులో ఉంటే పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో బస చేస్తారు.

రాష్ట్రంలో రద్దీగా ఉండే 21 దేవాలయాల్లో వసతి సౌకర్యం పెంచే చర్యలు తీసుకోవాలి. టెంట్లు (గుడారాలు) ఏర్పాటు చేసి వసతి కల్పించే ప్రాజెక్టులను ప్రారంభించాలని అదే విధంగా గోదావరి, కృష్ణా నదుల వద్ద నిర్వహిస్తున్న హారతుల కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక శోభ పెంచేలా చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.

6వ ఎస్ఐపీబీ ఆమోదం తెలిపిన పెట్టుబడుల వివరాలు :

6వ ఎస్ఐపీబీ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన మొత్తం 19 సంస్థలకు సంబంధించి రూ. 33,720 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 34,621 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

ఐ అండ్ సి డిపార్ట్‌మెంట్ :

1) డెక్కన్ ఫైన్ కెమికల్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ : కుమరవరం, అనకాపల్లి జిల్లా - రూ.1,560 కోట్ల పెట్టుబడులు, 1,800 ఉద్యోగాలు

2) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ : పాలసముద్రం, శ్రీ సత్యసాయి జిల్లా - రూ.1,400 కోట్ల పెట్టుబడులు, 800 ఉద్యోగాలు

3) పీయూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ : ఓర్వకల్, కర్నూలు జిల్లా - రూ.1,286 కోట్ల పెట్టుబడులు, 1,200 ఉద్యోగాలు

4) బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ : రాంబిల్లి, అనకాపల్లి జిల్లా - రూ.2,300 కోట్ల పెట్టుబడులు, 1,750 ఉద్యోగాలు

5) జుపిటర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ : రాంబిల్లి, అనకాపల్లి జిల్లా - రూ.2,700 కోట్ల పెట్టుబడులు, 2,216 ఉద్యోగాలు

టెక్స్‌టైల్ డిపార్ట్‌మెంట్ :

6) రాంభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ : తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా - రూ.228 కోట్ల పెట్టుబడులు, 250 ఉద్యోగాలు

7) మోహన్ స్పింటెక్స్ : మాలవల్లి, కృష్ణా జిల్లా - రూ.482 కోట్ల పెట్టుబడులు, 1,525 ఉద్యోగాలు

8) ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ : అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా - రూ.1,779 కోట్ల పెట్టుబడులు, 600 ఉద్యోగాలు

ఏపీఐఐసీ డిపార్ట్‌మెంట్ :

9) వింగ్‌టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ : తిరుపతి జిల్లా - రూ.1,061 కోట్ల పెట్టుబడులు, 10,098 ఉద్యోగాలు

10) అలీప్ కుప్పం : చిత్తూరు జిల్లా - రూ.5 కోట్ల పెట్టుబడులు, 1,500 ఉద్యోగాలు

ఎనర్జీ డిపార్ట్‌మెంట్ :

11) నితిన్ సాయి కనస్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ : ఏలూరు జిల్లా - రూ.150 కోట్ల పెట్టుబడులు, 500 ఉద్యోగాలు

12) దేశ్‌రాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ : అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు - రూ.2,920 కోట్ల పెట్టుబడులు, 230 ఉద్యోగాలు

13) ఆంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ : కడప జిల్లా - రూ.3,941 కోట్ల పెట్టుబడులు, 260 ఉద్యోగాలు

14) బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్ : అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు - రూ.9,000 కోట్ల పెట్టుబడులు, 3,900 ఉద్యోగాలు

టూరిజం డిపార్ట్‌మెంట్ :

15) బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ ఎల్ఎల్‌ పి: తిరుపతి - రూ.150 కోట్ల పెట్టుబడులు, 350 ఉద్యోగాలు

16) స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ : తిరుపతి - రూ.327 కోట్ల పెట్టుబడులు, 570 ఉద్యోగాలు

17) వరుణ్ హాస్పటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ : విశాఖపట్నం - రూ.899 కోట్ల పెట్టుబడులు, 1,300 ఉద్యోగాలు

ఐటీ డిపార్ట్‌మెంట్ :

18) డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ : శ్రీసిటీ, తిరుపతి జిల్లా - రూ.2,475 కోట్ల పెట్టుబడులు, 5,150 ఉద్యోగాలు

19) సెన్సోరెమ్ ఫోటోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ : కర్నూలు జిల్లా - రూ.1,057 కోట్ల పెట్టుబడులు, 622 ఉద్యోగాలు

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం