AP ICET Results 2024 Updates : ఏపీ ఐసెట్ ఫలితాలు వచ్చేశాయ్. ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలను చూసుకోవచ్చు.
ఈ ఏడాది నిర్వహించిన ఏపీ ఐసెట్ పరీక్షకు మొత్తం 48,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 18,890 మంది బాలురు, 29,938 మంది బాలికలు ఉన్నారు. పరీక్షకు మొత్తం 44,446 మంది (91 శాతం) అభ్యర్థులు హాజరయ్యారు. మే 8న ఐసెట్ ప్రిలిమినరీ కీ అందుబాటులోకి వచ్చింది.
ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్షను ఈ ఏడాది శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహించింది.ఈ ఏడాది ఫలితాల్లో 96.71 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.
రాష్ట్రంలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో ప్రవేశం కొరకు నిర్వహించిన డిఈఈ సెట్ 2024(AP DEECET) ప్రవేశ పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. డిఈఈసెట్ కన్వీనర్ ,జాయింట్ డైరెక్టర్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారి కార్యాలయంలో ఈ ఫలితాలను ప్రకటించారు ఈ పరీక్షకు 4949మంది అభ్యర్థులు హాజరు కాగా 3191 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.
మ్యాథమెటిక్స్ విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థి బులుసు గ్రీష్మిత మొదటి ర్యాంక్ సాధించారు. ఫిజికల్ సైన్స్ విభాగంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థి కేసన మీనాక్షికి ఫస్ట్ ర్యాంక్ రాగా…. బయలాజికల్ సైన్స్ విభాగంలో కడప జిల్లాకు చెందిన అభ్యర్థి షేక్ రుక్సానకు మొదటి ర్యాంక్ దక్కింది.
జూన్ 6 నుండి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చని అధికారులు ప్రకటించారు. జూన్ 20 వ తేదీ నుండి కోర్సు ప్రారంభమవుతుందని తెలిపారు. https://apdeecet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.