AP ICET Results: ఏపీ ఐసెట్ -2023 ఫలితాలు విడుదల - లింక్ ఇదే
AP ICET results 2023: ఏపీ ఐసెట్ - 2023 ఫలితాలు విడుదలయ్యాయి. https://cets.apsche.ap.gov.in లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
AP ICET Results 2023: ఆంధ్రప్రదేశ్ ఐసెట్ - 2023 ఫలితాలు వచ్చేశాయి. గురువారం మధ్యాహ్నం తర్వాత ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. ర్యాంకుల ఆధారంగా ఏపీలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఏడాదికి సంబంధించిన ప్రవేశ పరీక్షను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించింది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షకు గాను... 44 వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ప్రాసెస్ ఇదే….
- అభ్యర్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- Results అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- Registration Number , హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
- View Results ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ ఫలితం డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ పొందవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంక కీలకం. భవిష్యత్ అవసరాల దృష్ట్యా జాగ్రత్తగా ఉంచుకోవాలి.
రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 24న ఈ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు రాశారు. తాజా ఫలితాల్లో జగదీశ్‌కుమార్‌రెడ్డి (రేణిగుంట) టాపర్ గా నిలవగా… సికింద్రాబాద్ కు చెందిన సాయివెంకట కార్తీక్ స్టేట్ సెకండ్ టాపర్ గా ఉన్నారు.
జూన్ 20 తెలంగాణ ఐసెట్ ఫలితాలు…
TS ICET Results Updates 2023: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ - 2023 పరీక్షకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించిన టీఎస్ ఐసెట్ - 2023 ఫలితాలను జూన్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. మే 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో పరీక్షలను నిర్వహించగా 70,900 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీపై అభ్యంతరాలను జూన్ 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు స్వీకరించారు. ఫలితాలను icet.tsche.ac.in వెబ్‌సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.