ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 12 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు ప్రకటించినట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. తిరిగి జూన్ 16 నుంచి ఏపీ హైకోర్టు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. అయితే అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేసినట్లు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు.
మొదటి దశలో మే 15, 22, 29 తేదీల్లో, రెండో దశలో జూన్ 5, 12 తేదీల్లో అత్యవసర కేసుల విచారణలు జరగనున్నాయి. మే 15, 22 తేదీల్లో జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ వై. లక్ష్మణరావు డివిజన్ బెంచ్, జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్ లో అత్యవసర కేసులను విచారిస్తారు.
మే 29న జస్టిస్ ఎన్. హరినాథ్, జస్టిస్ వై. లక్ష్మణరావు డివిజన్ బెంచ్ లో, జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్ లో కేసుల విచారణ చేపట్టనున్నారు.
జూన్ 5, 12వ తేదీల్లో జస్టిస్ టీసీడీ.శేఖర్, జస్టిస్ ఎం. కిరణ్మయి డివిజన్ బెంచ్, జస్టిస్ మహేశ్వరరావు సింగిల్ బెంచ్ లో కేసులను విచారించనున్నారు. డివిజన్ బెంచ్ కేసుల విచా రణ పూర్తయ్యాక సింగిల్ బెంచ్ విధులను న్యాయమూర్తులు నిర్వహించనున్నారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్ధసారథి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ హైకోర్టుకు మే 5 నుంచి వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. మే 5 నుంచి జూన్ 6వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ఉంటాయి. వేసవి సెలవుల నేపథ్యంలో అత్యవసర కేసుల విచారణకు స్పెషల్ బెంచీల ఏర్పాటు చేశారు.
తెలంగాణ హైకోర్టులో 5 స్పెషల్ బెంచ్ లు అత్యవసర కేసుల విచారణ చేపట్టనున్నాయి. మే 5 నుంచి జూన్ 6 వరకు తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. మే 5, 12 19, 26, జూన్ 2 తేదీల్లో అత్యవసర కేసుల ఫైలింగ్, మే 7, 14, 21, 28, జూన్ 4 తేదీల్లో విచారణ జరగనుందని పేర్కొన్నారు.
హెబియస్ కార్పస్, ముందస్తు బెయిల్, ట్రయల్ కోర్టు తిరస్కరించిన కేసుల్లో బెయిల్, ఇతర అత్యవసర కేసులను వెకేషన్ బెంచ్‌ల వద్ద ఫైల్ చేయొచ్చని చెప్పారు. లంచ్ మోషన్ కేసులు, అత్యవసర పిటిషన్ల మెన్షన్ పై డివిజన్ బెంచ్‌లో సీనియర్ న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు.
సంబంధిత కథనం