AP HC On Constable Exam: ఆ 8 ప్రశ్నల వివరాలు ఇవ్వండి.. పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు -ap high court orders to police recruitment board over constable prelims exam marks ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap High Court Orders To Police Recruitment Board Over Constable Prelims Exam Marks

AP HC On Constable Exam: ఆ 8 ప్రశ్నల వివరాలు ఇవ్వండి.. పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు

HT Telugu Desk HT Telugu
Mar 04, 2023 07:22 AM IST

ap constable prelims exam:పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షపై దాఖలన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. 8 ప్రశ్నలకు సరైన జవాబు విషయంలో రిక్రూట్ మెంట్ బోర్డుతో పాటు హోంశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ హైకోర్టు విచారణ
ఏపీ హైకోర్టు విచారణ

AP high court orders to Police recruitment Board: ఏపీలో పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయడానికి ప్రాథమిక రాత పరీక్షలు నిర్వహించారు. రాత పరీక్షల్లో అర్హత పొందిన వారికి ఫిజికల్‌ ఈవెంట్స్‌ కోసం హాల్‌ టిక్కెట్లు విడుదల చేశారు. అయితే ప్రిలిమ్స్ పరీక్షలో పలు ప్రశ్నలకు సరైన జవాబులను నిర్ణయించలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై శుక్రవారం విచారించిన హైకోర్టు... రిక్రూట్ మెంట్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది.

ట్రెండింగ్ వార్తలు

సరైన జవాబులు ఇవ్వలేదు...

పిటిషనర్ల తరపున న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాతపరీక్షలో 8 ప్రశ్నలకు సరైన జవాబులను ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిని నిపుణుల కమిటీకి పంపాల్సిన అవసరం ఉందని వాదించారు. మరోవైపు ఈ నెల 13 నుంచి దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. ఆయా పరీక్షల దృష్ట్యా... పిటిషనర్లను వాటికి అనుమతించేలా అధికారులను ఆదేశించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న కోర్టు... రిక్రూట్ మెంట్ బోర్డుకు ఆదేశాలు ఇచ్చింది.

దేదారుఢ్య పరీక్షలకు కాల్ లెటర్స్..

రాత పరీక్షల్లో అర్హత పొందిన వారికి ఫిజికల్‌ ఈవెంట్స్‌ కోసం హాల్‌ టిక్కెట్లు విడుదల చేసింది రిక్రూట్ మెంట్ బోర్డు. ఫేజ్‌-2 పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా పీఎంటీ, పీఈటీ పరీక్షలకు సంబంధించిన కాల్‌ లెటర్లు మార్చి 10 మధ్యాహ్నం 3గంటల వరకు అందుబాటులో ఉంటాయని పోలీసు నియామక మండలి తెలిపింది. ఇందుకోసం అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో పాటు మొబైల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్‌ https://slprb.ap.gov.in/ను సందర్శించాల్సి ఉంటుంది.

కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా జనవరి 22న ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,59,182 మంది హాజరయ్యారు. వీరిలో 95,209 మంది (20.73%) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో పోస్టుకు 16 మంది పోటీపడుతున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 95,209 మందికి త్వరలో దేహదారుఢ్య పరీక్షలు (పీఎంటీ, పీఈటీ) నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్‌ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారంతా స్టేజ్‌-2 పరీక్షల కోసం ఫిబ్రవరి 13 నుంచి 20 వరకూ పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. దేహదారుఢ్య పరీక్షల సమయంలోనే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుంది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారిలో 77,876 మంది పురుషులు, 17,332 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 3,63,432 మంది పురుషులు పరీక్ష రాయగా వారిలో 21.42 శాతం మంది, 95,750 మంది మహిళలు పరీక్ష రాయగా వారిలో 18.10 శాతం మంది అర్హత సాధించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం