ap high court comments on bigboss show: బిగ్ బాస్ షోలోని షోలోని అశ్లీలతపై దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. గత విచారణ సందర్భంగా సీరియస్ కామెంట్స్ చేసిన ధర్మాసనం... తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. రియాలిటీ షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు అందులో ఏముందో తెలుసుకునేందుకు తామూ రెండు మూడు ఎపిసోడ్లు చూస్తామని స్పష్టం చేసింది. ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిది.,విచారణ సందర్భంగా పిటిషన్ సెన్సార్‌షిప్ అంశాన్ని ప్రస్తావించారు. ఎలాంటి సెన్సార్ షిప్ లేకుండా ఈ షో ప్రసారమవుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పరిశీలించాలని కోర్టును కోరారు. ఈ పోటీలో పాల్గొనే మహిళలకు ప్రెగ్నెన్సీ పరీక్షలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ధర్మాసనం .. ఈ షోలో ఏముందో తెలుసుకునేందుకు తాము కూడా రెండు మూడు ఎపిసోడ్లు చూస్తామని స్పష్టం చేసింది.,అశ్లీల, అనైతిక, హింసాత్మక చర్యలను ప్రోత్సహిస్తున్న బిగ్‌బాస్ షో ప్రసారాన్ని నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లో, ఇటీవల దాఖలు చేసిన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.,బిగ్‌బాస్ రియాల్టీ షోలోని అశ్లీలతపై గత విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఘాటుగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. 1970ల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా గుర్తు చేసింది. అయితే బిగ్ బాస్ రియాల్టీ షో వేర్వురు భాషాల్లో ప్రసారం అవుతోంది. అయితే విచారణ సందర్భంగా కేవలం ఏ ఒక్క భాషానో కాకుండా...ఒవరాల్ గా బిగ్ బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందనే అంశంపై విచారణ జరిగినట్లు తెలుస్తోంది.,ఇదిలా ఉంటే బిస్‌బాస్‌ను బ్యాన్ చేయాలంటూ కొద్దిరోజులుగా డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో పై సీపీఐ నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా షోను రద్దు చేయాలని కోరిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులతో కలిసి చూడలేని ఈ షోను బ్యాన్ చేయాలని పలువురు తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు.,ఈనేపథ్యంలో తదుపరి విచారణ తర్వాత ఏపీ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది..? రియాల్టీ షో నిర్వహకులకు ఏమైనా నోటీసులు ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది., , , , , , ,