AP High Court Recruitment 2023: జేసీజే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల -ap high court issued civil judge jobs recruitment 2023 check full details are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap High Court Issued Civil Judge Jobs Recruitment 2023 Check Full Details Are Here

AP High Court Recruitment 2023: జేసీజే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

HT Telugu Desk HT Telugu
Mar 08, 2023 06:51 PM IST

Andhra Pradesh High Court Recruitment 2023:ఏపీ హైకోర్టు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. 30 జూనియర్‌ సివిల్‌ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు
ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు

AP HC Civil Judge Jobs Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర జ్యుడీషియల్‌ సర్వీసెస్‌లో భాగంగా 30 జూనియర్‌ సివిల్‌ జడ్జి (జేసీజే) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ మేరకు ఆయా పోస్టుల వివరాలు చూస్తే....

ట్రెండింగ్ వార్తలు

తాజాగా నోటిఫికేషన్ లో ఇచ్చిన 30 ఉద్యోగాల్లో 24 పోస్టులను ప్రత్యక్షంగా రిక్రూట్ చేస్తుండగా.. మరో ఆరు పోస్టులను రిక్రూట్‌మెంట్‌ బై ట్రాన్స్‌ఫర్‌ ద్వారా పూర్తి చేయనున్నారు. ఈ నెల 17 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 6వ తేదీన తుది గడువుగా నిర్ణయించారు. హైకోర్టు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య వివరాలు :

పోస్టుల పేరు - జూనియర్ సివిల్ జడ్జీ(జేసీజే)

మొత్తం ఉద్యోగాలు - 30

దరఖాస్తులు ప్రారంభం - మార్చి 17, 2023

దరఖాస్తులకు తుది గడువు - ఏప్రిల్ 6, 2023

హాల్ టికెట్లు - 15 -04 -2023.

పరీక్ష తేదీ - ఏప్రిల్ 24, 2023.

పరీక్ష విధానం - (కంప్యూటర్‌ ఆధారిత స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహిస్తారు) ఈ పరీక్షలో 40, అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించిన వా­­రిని 1:10 నిష్పత్తిలో రాతపరీక్షకు అనుమతిస్తారు. గుంటూరు, కర్నూలు, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం పట్టణాల్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.

కీ విడుదల - 27 -04 -2023

మొత్తం 30 పోస్టుల్లో 17 పోస్టులకు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఓసీ 15, ఈడ­బ్ల్యూ­ఎస్‌–3, బీసీ–ఏ 3, బీసీ–బీ 1, బీసీ–సీ 1, బీసీ–డీ 1, బీసీ–ఈ 1, ఎస్సీ–4, ఎస్టీ–1 చొప్పున పోస్టులు ఉన్నాయి.

NOTE: జేసీజే పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తులు, హాల్ టికెట్లు, ఫలితాలతో పాటు ఇతర అప్డేట్స్ తెలుసుకోవాలంటే… https://hc.ap.nic.in/index.html వెబ్ సైట్ ను సందర్శించాలి.

IPL_Entry_Point