AP TG Weather Report : తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో వడగాల్పులు వీస్తున్నాయి. రేపు(గురువారం) 59 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం శ్రీకాకుళం జిల్లాలో 15, విజయనగరం-20, మన్యం-14, అల్లూరి సీతారామరాజు-2, కాకినాడ-3, తూర్పుగోదావరి-5 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇవాళ నంద్యాల జిల్లా చాగలమర్రిలో 42.3°C, వైఎస్సార్ కడప జిల్లా అట్లూరు, ఖాజీపేటలో 41.2°C, ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 40.7°C, కర్నూలులో 40.6°C, అన్నమయ్య జిల్లా కంబాలకుంట 40.2°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి.
ఉపరితల ద్రోణి ఒడిశా మధ్య ప్రాంతాల నుండి దక్షిణ విదర్భ వరకు దక్షిణ ఛత్తీస్గఢ్ అంతర్భాగంగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఉపరితల ద్రోణి మరాఠ్వాడ నుండి దక్షిణ తమిళనాడుపై నున్న ఉపరితల ఆవర్తనం వరకు, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. దిగువ ట్రోపో ఆవరణములో ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.
తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్ద మార్పు ఉండదని, ఆ తర్వాత రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలలో స్వల్ప తగ్గుదల ఉంటుందని పేర్కొంది. రేపు(గురువారం) రాష్ట్రంలో పొడి వాతావరం ఉంటుంది. వాతావరణ హెచ్చరికలు లేవు.
21వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 8.30 వరకు - తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు...ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
22వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి 23వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు -తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40-50 కి.మీ)తోపాటు వడగళ్లతో కూడిన వర్షాలు.. నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు. ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్,
కgమురంభీం -ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి , హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
సంబంధిత కథనం