AP IAS Transfers : ఏపీలో సీనియర్ ఐఏఎస్ ల బదిలీ, ఆ 5గురికి పోస్టింగ్ లు-ap govt transfers senior ias officers postings for 5 ias officers waiting for posts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ias Transfers : ఏపీలో సీనియర్ ఐఏఎస్ ల బదిలీ, ఆ 5గురికి పోస్టింగ్ లు

AP IAS Transfers : ఏపీలో సీనియర్ ఐఏఎస్ ల బదిలీ, ఆ 5గురికి పోస్టింగ్ లు

AP IAS Transfers : ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే పోస్టింగ్ కోసం చూస్తున్న 5గురు ఐఏఎస్ లకు పోస్టింగులు ఇచ్చింది. రెవెన్యూ, భూ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియాను బదిలీ చేసింది. రేవు ముత్యాలరాజుకు కీలక బాధ్యతలు అప్పగించింది.

ఏపీలో సీనియర్ ఐఏఎస్ ల బదిలీ, ఆ 5గురికి పోస్టింగ్ లు

AP IAS Transfers : ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రెవెన్యూ, భూ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా బదిలీ అయ్యారు. హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సిసోడియాను నియమించింది. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జయలక్ష్మికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం CCLA స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జయలక్ష్మి ఉన్నారు. ఏపీ హెచ్ఆర్డీ సంస్థ డైరెక్టర్‌గా కాటమనేని భాస్కర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఐటీ సెక్రటరీగా కాటమనేని భాస్కర్ పనిచేస్తున్నారు.

పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న 5 ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్స్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

▪️రేవు ముత్యాలరాజు - పంచాయతీ రాజ్ & గ్రామమీణభివృద్ధి శాఖ కమిషనర్

▪️ కె.మాధవి లత-ఏపీ రైతు బజార్, సీఈవో

▪️ఎం. గౌతమి -ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ (గురుకులం), సెక్రెటరీ

▪️కొత్తమాసు దినేష్ కుమార్-ఆయుష్, డైరెక్టర్

▪️కె. నీల కంఠరెడ్డి - ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, మేనేజింగ్ డైరెక్టర్

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం