AP Govt Jobs : మెడికల్ కాలేజీల్లో 170 ఉద్యోగాలు - నోటిఫికేషన్ విడుదల, కేవలం ఇంటర్వ్యూనే!-ap govt releases notification for filling up 170 assistant professor posts in government medical colleges ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Govt Releases Notification For Filling Up 170 Assistant Professor Posts In Government Medical Colleges

AP Govt Jobs : మెడికల్ కాలేజీల్లో 170 ఉద్యోగాలు - నోటిఫికేషన్ విడుదల, కేవలం ఇంటర్వ్యూనే!

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 09, 2023 05:37 AM IST

AP Govt Latest Jobs : ఏపీ ప్రభుత్వం నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 170 పోస్టుల భర్తీకి మెడికల్ బోర్డు ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు

Assistant Professor Jobs in Andhrapradesh :వైద్యకళాశాలల్లో 170 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. శాశ్వత ప్రాతిపదికన కొన్ని, మరికొన్నింటి కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలను చేపట్టబోతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా... వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా ఉన్న 144 పోస్టుల్ని శాస్వత ప్రాతిపదికన (డైరెక్ట్/లేటరల్) భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు గాను ఈ నెల 18, 20 తేదీలలో విజయవాడ హనుమాన్ పేట పాత ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈఇ) కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్‌ఇన్ రిక్రూట్మెంట్ జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) విశాఖపట్నంలో వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా ఉన్న 26 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 15న విశాఖపట్నం హనుమంతవాక జంక్షన్‌లోని విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్‌ఇన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నారు. అభ్యర్ధులు ఆయా తేదీలలో నిర్ణీత ప్రదేశాలలో జరిగే వాక్‌ఇన్ రిక్రూట్మెంట్‌కు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. అర్హతా ప్రమాణాలు, ఇతర మార్గదర్శకాల కోసం https://dme.ap.nic.in/ వెబ్ సైట్ ను చూడొచ్చని మెడికల్ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

WhatsApp channel