AP Liquor Shops : గీత కార్మికులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, 335 మద్యం షాపులు కేటాయింపు
AP Liquor Shops : ఏపీలో మరోసారి మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గీత కార్మికులకు 335 మద్యం షాపులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. జిల్లాల వారీగా దరఖాస్తులు ఆహ్వానించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి రెండేళ్ల కాలానికి లైసెన్సులు జారీ చేయనున్నారు.
AP Liquor Shops : ఏపీ ప్రభుత్వం గీత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. గీత కార్మికులకు 335 మద్యం షాపులు కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. 335 మద్యం షాపులకు...జిల్లాల వారీగా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లాల కలెక్టర్లు ఆధ్వర్యంలో లాటరీలు తీసి లైసెన్స్ లు జారీ చేయనున్నారు. ఈ షాపులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ కుల, నేటివిటీ సర్టిఫికెట్లు సమర్పించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఒక షాపునకు నాన్ రిఫండబుల్ ఫీజు రూ. 2 లక్షలుగా నిర్ణయించారు. గీత కార్మికులు ఆయా జిల్లాల పరిధిలో కేటాయించిన అన్ని షాపులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఒక అభ్యర్థికి ఒక షాపు మాత్రమే కేటాయించనున్నట్టు నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. లాటరీలో ఒకటి ఎక్కువ షాపులు వస్తే అభ్యర్థి ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండేళ్ల కాలానికి మద్యం దుకాణాలకు లైసెన్స్ జారీ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్ల కాలానికి(2024-26) మద్యం పాలసీ ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ పాలసీలో భాగంగా గీత కులాలకు 335 మద్యం షాపులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. గీత కులాల సాధికారతను ప్రోత్సహించేందుకు ఈ షాపులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొది. గీత కులాలు కల్లు గీత సంప్రదాయ వృత్తిని కొనసాగిస్తున్నాయి. వీరిని యాట గౌడ, ఎడిగ, గౌడ (గమల), కలాలీ, శ్రీసయన (సెగిడి), శెట్టిబలిజా అని పిలుస్తారు.
గీత కార్మికుల మద్యం షాపుల కేటాయింపు ప్రధానాంశాలు
గీత కులాలకు 10 శాతం అదనపు మద్యం షాపులకు కేటాయించడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తుంది.
2016 స్మార్ట్ పల్స్ సర్వే ఆధారంగా... జిల్లాల వారీగా గీత కులాల జనాభా నిష్పత్తి ప్రకారం మద్యం షాపులు కేటాయింంచనున్నారు.
షెడ్యూల్ ప్రాంతాల్లోని గీత కులాలకు మద్యం షాపులు కేటాయించరు. ఒక్క వ్యక్తికి ఒక షాపు మాత్రమే అంటే ఒక లైసెన్స్ మాత్రమే ఇస్తారు.
గీత కులాల వార్షిక లైసెన్స్ ఫీజు సాధారణ షాపుల ఫీజుతో పోలిస్తే 50 శాతం తక్కువగా నిర్ణయించారు.
మద్యం దుకాణాల దరఖాస్తు విధానం ఇలా
గీత కార్మికుల మద్యం షాపులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లేదా హైబ్రిడ్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ , నేటివిటీ సర్టిఫికెట్ అందించాలి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీస్తారు. మద్యం షాపుల లైసెన్స్ గడువు 30 సెప్టెంబర్ 2026 వరకు ఉంటుంది.
సంబంధిత కథనం