AP Govt Schemes : బీసీ వర్గాలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్-మహిళలకు రూ.24 వేలు, యువతకు సబ్సిడీపై రూ.8 లక్షల రుణం
AP Govt Schemes : ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. బీసీ వర్గాల్లో మహిళలకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా 90 రోజుల పాటు టైలరింగ్ శిక్షణ ఇచ్చి రూ.24 వేలు విలువ గల కుట్టు మిషన్ ఉచితంగా అందించనున్నారు. అలాగే బీసీ నిరుద్యోగ యువతకు జనరిక్ షాపుల ఏర్పాటుకు సబ్సిడీపై రూ.8 లక్షల రుణం అందించనున్నారు.
AP Govt Schemes : ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. బీసీ మహిళలకు 90 రోజుల టైలరింగ్ శిక్షణతో పాటు ఒక్కొక్కరికి రూ.24,000 విలువ గల కుట్టుమిషన్ ఉచితంగా అందించనుంది. ఇందుకోసం మహిళలకు ఓబీఎంఎస్ సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు సన్నాహం చేస్తుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అందించిన సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తుంది. మహిళలకు స్వయం ఉపాధి అందించేందుకు బీసీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టనుంది. మహిళలకు స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు వివిధ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించింది. స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా ఈ ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 80 వేల బీసీ మహిళలకు లబ్ధి చేకూరనుంది.
రూ.24 వేలు విలువ చేసే కుట్టు మిషన్
మహిళలకు 90 రోజుల టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి, రూ.24 వేలు విలువ చేసే కుట్టుమిషన్ ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియపై త్వరలోనే దరఖాస్తులు స్వీకరించనుంది. ఇప్పటికే మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణను అందించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. దీంతో పాటు యువతకు జనరిక్ మందుల షాపుల ఏర్పాటుకు సహాకారం అందించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో బీసీ వర్గాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
జనరిక్ షాపుల ఏర్పాటుకు రుణాలు
గ్రామాల్లోని బీసీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిరుద్యోగ యువత జనరిక్ మందుల షాపులు ప్రారంభించేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ షాపుల ఏర్పాటుకు బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన నిరుద్యోగ యువతకు రూ.8 లక్షల రుణం అందించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందులో రూ.4 లక్షలు సబ్సిడీగా ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి ఆమోదం పొందగానే ఈ పథకాలు అమలులోకి రానున్నాయి.
సంబంధిత కథనం