AP Govt Microsoft MoU : ఏపీ యువతకు శుభవార్త.... 2 లక్షల మందికి 'ఏఐ' నైపుణ్య శిక్షణ - మైక్రోసాఫ్ట్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం
యువతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలు పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రెండు లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వనున్నారు.

మెక్రోసాఫ్ట్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం తీసుకుంది. కృత్రిమ మేథ (AI), అధునాతన సాంకేతికతలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా గురువారం మెక్రోసాఫ్ట్, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఐటీ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో….ఇరుపక్షాల ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.
రాష్ట్రంలోని ఐటీ ఆధారిత, ఇతర పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన సిబ్బందిని తయారుచేయటమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో భాగంగా… ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాటు యువతకు శిక్షణ ఇస్తారు.
ఈ సందర్భంగా ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఈ ఒప్పందం ప్రకారం మైక్రోసాఫ్ట్ కేవలం ఒక సంవత్సరంలోనే రెండు లక్షలకు పైగా యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణను అందిస్తుందని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా…యువతకు ఎన్నో అవకాశాలు దక్కుతాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పోటీ వాతావరణంలోనూ…. ఉద్యోగాలు సులభంగా పొందడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.
2 లక్షల మందికి నైపుణ్య శిక్షణ…
ఈ ఒప్పందంలో భాగంగా… గ్రామీణ పరిధిలోని 50 ఇంజినీరింగ్ కాలేజీల్లోని 500 మంది ఉపాధ్యాయులతో పాటు 10 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్షణ పొందుతారు. అంతేకాకుండా 30 ఐటీఐల నుంచి 30,000 మంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీలో శిక్షణ ఇస్తారు.
రాష్ట్రంలో పాస్‌పోర్ట్ టు ఎర్నింగ్ 2.0 ను ప్రవేశపెట్టేందుకు 40,000 మంది యువతకు AI నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వబడుతుంది. మరో 20,000 మందికి కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ సహకారంతో శిక్షణ ఇస్తారు. అంతేకాకుండా… ప్రజా సేవలను మెరుగుపరచడానికి మరియు ప్రభుత్వ అధికారులలో సామర్థ్యాల పెంపు కోసం 50,000 మందికి 100 గంటల AI శిక్షణ ఇస్తారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో మెక్రోసాఫ్ట్ తో పాటు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కీలకంగా పని చేస్తుంది. పలు విభాగాల మధ్య అంతర్గత సహకారంపై స్వీయ అభ్యాస మార్గాలు, వర్క్‌షాప్‌లు, వెబ్‌నార్లు కూడా నిర్వహిస్తోంది. ఏఐ శిక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ AI శిక్షణను అందించడానికి సంబంధిత విభాగాలతో సమన్వయం చేస్తుంది.
సంబంధిత కథనం