AP Building Permissions : బిల్డింగ్ పర్మిషన్లపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ, పట్టణ స్థానిక సంస్థలకు అధికారాలు బదిలీ-ap govt issues guidelines on building permissions transfers powers to urban bodies ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Building Permissions : బిల్డింగ్ పర్మిషన్లపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ, పట్టణ స్థానిక సంస్థలకు అధికారాలు బదిలీ

AP Building Permissions : బిల్డింగ్ పర్మిషన్లపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ, పట్టణ స్థానిక సంస్థలకు అధికారాలు బదిలీ

Bandaru Satyaprasad HT Telugu
Feb 04, 2025 10:48 PM IST

AP Building Permissions : రాష్ట్రంలో బిల్డింగ్ పర్మిషన్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 300 చ.మీ లోపు నిర్మాణాలకు యజమానులే స్వయంగా ప్లాన్ ధ్రువీకరించి దరఖాస్తు చేసుకునేలా అనుమతి ఇచ్చింది.

బిల్డింగ్ పర్మిషన్లపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ, పట్టణ స్థానిక సంస్థలకు
బిల్డింగ్ పర్మిషన్లపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ, పట్టణ స్థానిక సంస్థలకు

AP Building Permissions : భవన నిర్మాణ అనుమతులపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలు సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ కింద భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేలా మార్గదర్శకాలు ఇచ్చింది. ఒక్క సీఆర్‌డీఏ మినహా రాష్ట్రంలోని అన్ని చోట్లా భవన నిర్మాణ అనుమతుల జారీ అధికారాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి పట్టణ స్థానిక సంస్థలకు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

yearly horoscope entry point

నివాస భవనాలకు మాత్రమే

300 చ.మీటర్లు లోపు నిర్మాణాలకు స్వయంగా యజమానులే ప్లాన్ ను ధ్రువీకరించి దరఖాస్తు చేసేలా చట్టంలో సవరణలు చేశారు. ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, టౌన్‌ప్లానర్లు సైతం దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించింది. దీంతో పాటు లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్‌లు కూడా ఇంటి ప్లాన్‌ను ధ్రువీకరించి అప్లోడ్ చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే కేవలం నివాస భవనాలకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు పోర్టల్‌లో ప్లాన్‌ అప్లోడ్‌ నిబంధనలను సులభతరం చేసింది.

రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు భవన నిర్మాణ అనుమతులను మరింత సరళతరం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా భవన నిర్మాణ అనుమతులకు సెల్ఫ్ సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. అయితే ఆన్‌లైన్‌ బిల్డింగ్ పర్మిషన్ సిస్టంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా భవన యజమానులపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ సీఎస్ సురేశ్ కుమార్ మార్గదర్శకాలు జారీ చేశారు.

15 మీటర్ల ఎత్తు వరకు

మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాలపై ఇటీవల ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. భవన నిర్మాణాల్లో ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనమతులు అవసరంలేదని మంత్రి నారాయణ ప్రకటించారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందన్నారు. భవనాలు, లేఅవుట్లకు సంబంధించి మున్సిపాలిటీకి రుసుము చెల్లిస్తే అనుమతులు ఇస్తామని తెలిపారు. 15 మీటర్ల ఎత్తు వరకు ఉన్న భవనాలకు ముందస్తు అనుమతులు అవసరం లేదని ఇటీవల మంత్రి చెప్పారు. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి సింగిల్ విండో అప్రూవల్ సిస్టమ్ ద్వారా భవనాల అనుమతులు జారీ చేస్తామన్నారు.

Whats_app_banner